Bigg Boss: ‘బిగ్ బాస్’ రియాలిటీ షో పై నోరు పారేసుకున్న సీపీఐ నారాయణ!

  • September 5, 2022 / 05:40 PM IST

నార్త్ లో సూపర్ సక్సెస్ అయిన ‘బిగ్ బాస్’ రియాలిటీ షో.. 2017 లో సౌత్ లో కూడా ప్రారంభమైంది. మలయాళం, తమిళ్,కన్నడ, భాషలతో పోలిస్తే తెలుగులోనే ఈ షో సూపర్ సక్సెస్ అయ్యింది. ‘బిగ్ బాస్’ షో కి కంటెస్టెంట్లుగా వెళ్లొచ్చిన చాలా మంది కంటెస్టెంట్స్ సూపర్ క్రేజ్ ను సంపాదించుకుని సినిమాల్లో కూడా రాణిస్తున్నారు.ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ అంటూ ఓటీటీ సీజన్ కూడా మొదలైంది కానీ అది అంత సక్సెస్ కాలేదు.

తాజాగా సీజన్ 6 పైగా ప్రారంభం కావడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఎన్నడూ లేని విధంగా 20 మంది కంటెస్టెంట్స్ తో ఈ సీజన్ మొదలవ్వడం విశేషం.ఈసారి కూడా 15 వారాల పాటు సీజన్ కొనసాగుతుంది. ఇదంతా ఒక పక్కైతే.. ఈ షో పై విమర్శలు చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ షో పై గతంలో కేసులు వేసిన వారు కూడా ఉన్నారు అంటే ఈ షో ఏ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ షో పై నోరు పారేసుకున్నారు సీపీఐ నారాయణ. ఈ మధ్య కాలంలో ఆయన అనవసరమైన విషయాల్లో తలదూర్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ‘బిగ్ బాస్’ గురించి ఆయన మాట్లాడుతూ.. “ఈ షో ద్వారా మాకేమి సందేశమిస్తున్నారని? ప్రేక్షకులు ప్రశ్నించాలి. మాలాగా మొగుళ్ళని, పెళ్ళాల్ని.. వదిలేసి అచ్చోసిన ఆంబోతుల్లాగా జీవించండని సందేశమిస్తారేమో ? గుడ్లప్పగించి చూడండి.

కాసులకు కక్కుర్తి పడే ల‌జ్జారహితులున్నంత కాలం, ఈ పాపాలకు ఆదరణ ఉంటున్నంత కాలం, ద్రౌపది వస్త్రాబరణం వర్ధిల్లుతూనే ఉంటుందని బాధాక‌రంగా దిగమింగుదామా ? శ్రీ శ్రీ చెప్పినట్టు పదండి ముందుకు, పదండి ముందుకని ఉరుకుదమా ? ఇది ఒక బూతు షో ’’ అంటూ విరుచుకుపడ్డారు సీపీఐ నారాయణ

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus