ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్.. అది పూర్తయ్యాక త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. నిజానికి 2020 సమ్మర్ కే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళాల్సింది. కానీ కరోనా వల్ల ప్లానింగ్ అంతా అప్సెట్ అయ్యింది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ల పై రాధాకృష్ణ(చినబాబు), కళ్యాణ్ రామ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
దర్శకుడు త్రివిక్రమ్ ఇప్పటికే 70శాతం స్క్రిప్ట్ ను ఫినిష్ చేశాడని సమాచారం. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ నే ఈ ప్రాజెక్టుకి ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం పొలిటికల్ టచ్ తో కూడిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ముస్తాబవ్వనుందట. ఇక ఎన్టీఆర్ ఒక ఎన్నారైగా ఈ చిత్రంలో కనిపిస్తాడట.పుట్టినప్పటి నుండీ ఇండియాకి రాని ఎన్టీఆర్ పాత్ర.. అతని కుటుంబంలో ఏర్పడ్డ సమస్యను పరిష్కరించడానికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోతుందట.
అంతేకాదు అతను ఒక యంగ్ బిజినెస్ మెన్ గా కనిపిస్తాడని కూడా తెలుస్తుంది.ఇక కథను మలుపు తిప్పే కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ కూడా ఓ పవర్ఫుల్ రోల్ పోషిస్తుందని సమాచారం.! ఆమె పాత్ర ఈ చిత్రానికే హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. 2021 సమ్మర్ కు ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట.మొదట ఎన్టీఆర్ అవసరం లేని షెడ్యూల్స్ ను త్రివిక్రమ్ మొదలుపెడతాడట. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా 2021 ఫిబ్రవరిలో నిర్మాతలు ఇవ్వబోతున్నట్టు సమాచారం.
Most Recommended Video
బిగ్బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!