ఇండస్ట్రీలో నెపోటిజం ఉందని చాలా మంది నటీనటులు వాదిస్తుంటారు. ఇప్పటికే దీనిపై చాలా మంది బాలీవుడ్ తారలు మాట్లాడారు. అప్పుడప్పుడూ టాలీవుడ్ లో కూడా ఈ టాపిక్ వినిపిస్తుంటుంది. టాలెంట్ ఉన్నవాళ్లకు అవకాశాలు రావడం లేదని.. బంధుప్రీతితో పేరు, బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికే అవకాశాలు ఇస్తుంటారనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. దీని గురించి తాజాగా ఓ షోలో రానా దగ్గుబాటి మాట్లాడారు. బంధుప్రీతి కొంతవరకే ఉపయోగపడుతుందని.. నటనలో ప్రతిభ చూపించకపోతే ఇండస్ట్రీలో నెట్టుకురావడం కష్టమని రానా అన్నారు.
ఒక నటుడిగా తన జీవితంలో బంధుప్రీతి, ప్రతిభతో ముందుకెళ్లడం రెండింటినీ చూశానని.. తెలుగులో నటుడిగా పరిచయమయ్యే సమయానికి తను ఇండస్ట్రీకి చెందిన మనిషినే అని.. కానీ బాలీవుడ్ లో అడుగుపెట్టినప్పుడు తను ఎవరో కూడా అక్కడివారికి తెలియదని అన్నారు. సౌత్ నుంచి వెళ్లడంతో తనది చెన్నై అని అనుకునేవారని తెలిపారు. తన దృష్టిలో వారసత్వం అనేది కేవలం మనల్ని పరిచయం చేయడానికే ఉపయోగపడుతుందని.. అంతకుమించి కొంచెం కూడా పనికిరాదని అన్నారు.
వారసత్వం పేరుతో స్టార్స్ అయితే కాలేమని అన్నారు. వారసత్వం గురించి ఒక ఉదాహరణ కూడా చెప్పారు. తన తాతయ్య ఊర్లో ఉన్న రైస్ మిల్లు అమ్మేసి వచ్చిన డబ్బుతో చెన్నైకి వచ్చి బిజినెస్ మొదలుపెట్టారని.. ఆ తరువాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 45 ఏళ్ల పాటు సినిమాలు తీశారని అన్నారు. ఆయన ఇద్దరు కొడుకులు కూడా ఇండస్ట్రీలోకి వచ్చారని.. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక స్టూడియో ఏర్పాటు చేశారని..
ఒకవేళ తను ఆ లెగసీని కొనసాగించకపోయినా, ఆ వ్యవస్థని ముందుకకు తీసుకెళ్లకపోయినా అది తప్పు అవుతుందని అన్నారు. తన కుటుంబానికి అన్యాయం చేసిన వాడిని అవుతానని అన్నారు. చాలామందికి వారసత్వం వల్ల వచ్చే బరువు, బాధ్యతలు తెలియవని చెప్పుకొచ్చారు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?