రజనీ.. బ్యాడ్ కాప్ గా చించేసాడు..!

  • December 16, 2019 / 07:10 PM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘దర్బార్’. 2020 సంక్రాంతి బరిలోనే ఈ చిత్రం కూడా విడుదల కాబోతుంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కాబోతుంది. ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ‘లైకా ప్రొడక్షన్’ సంస్థ పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ సింగిల్ ను ఇదివరకే విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

ట్రైలర్ మొత్తం రజినీ స్టైల్ లో సాగింది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ .. మాస్ ఎలెమెంట్స్ తో నింపేసాడు దర్శకుడు మురుగదాస్. సునీల్ శెట్టి ఈ చిత్రంలో విలన్ గా నటించినట్టు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. ఎటువంటి ప్రమాదాన్ని లెక్కచేయని ఓ పోలీస్ ఆఫీసర్ గా రజినీ ట్రైలర్ లో కనిపించాడు. ‘పోలీస్ ల దగ్గరికి లెఫ్ట్ లో రావొచ్చు.. ర్తెట్లో రావొచ్చు.. కానీ స్ట్రెయిట్ గా రావొద్దు’ అని రజినీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ అద్భుతం. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చించేసాడు. రజినీ ఫ్యాన్స్ కు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఈ ట్రైలర్ లో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో ‘ఐ యామ్ ఏ బ్యాడ్ కాప్’ అంటూ రజినీ ఆటిట్యూడ్ తో నడిచి వస్తున్న క్లిప్ కు గూజ్ బంప్స్ రావడం ఖాయమనే చెప్పాలి. ఈ సంక్రాంతికి ఈ చిత్రం కూడా గట్టి పోటీనే ఇచ్చేలా ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus