Das Ka Dhamki: ‘దాస్ క ధమ్కీ’ ఇన్సైడ్ టాక్ ఎలా ఉందంటే?

  • March 21, 2023 / 08:53 PM IST

విశ్వక్ సేన్ కి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే నాని నిర్మాణంలో చేసిన ‘హిట్'(ది ఫస్ట్ కేస్) మినహా ఇతని ఖాతాలో చెప్పుకోదగిన కమర్షియల్ హిట్ అయితే పడలేదు. విశ్వక్ సినిమా వస్తుంది అంటే.. దానికి ముందు లేదా వెనుక ఓ పెద్ద కాంట్రవర్సీ రన్ అవుతూ ఉంటుంది. దాని పేరుతో తన సినిమాని గట్టిగా ప్రమోట్ చేసుకోవాలని విశ్వక్ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పటివరకు 9 సినిమాల్లో నటించాడు.

కానీ టైర్ 2 లిస్ట్ లో ఎంట్రీ ఇచ్చేలా అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి అయితే చేయడం లేదు. అయితే అతని లేటెస్ట్ మూవీ ‘దాస్ క ధమ్కీ’ మాత్రం బాక్సాఫీస్ వద్ద గట్టిగా రాబట్టే అవకాశాలు ఉన్నాయి. నెల రోజుల నుండి బాక్సాఫీస్ వద్ద పెద్ద బజ్ ఉన్న సినిమాలు రిలీజ్ కాలేదు. అందులోనూ మాస్ ఆడియన్స్ ఉసూరుమంటూ ఉన్నారు. వాళ్ళ అభిరుచికి తగ్గట్టు ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

రేపు ఉగాది పండుగ. కచ్చితంగా ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్తారు. ఇలాంటి టైంలో ఓ మంచి మాస్ సినిమా రిలీజ్ అయితే.. డౌట్ లేకుండా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఆ ఛాన్స్ ‘దాస్ క ధమ్కీ’ కి కనిపిస్తుంది. పోటీగా ‘రంగమార్తాండ’ సినిమా కూడా రిలీజ్ అవుతున్నా.. అది క్లాస్ సినిమా. అందులోనూ కృష్ణవంశీ సినిమా కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

అయితే యూత్, మాస్ ఆడియన్స్ ఫస్ట్ ఆప్షన్ ‘దాస్ క ధమ్కీ’ నే..! కచ్చితంగా ఈ మూవీ విశ్వక్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేయడం ఖాయం. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా అతని కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ కూడా వస్తాయి. ఇన్సైడ్ టాక్ అయితే బాగానే ఉంది. ఒకసారి చూడగలిగే సినిమా అంటున్నారు. ప్రీమియర్స్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus