ఏకంగా ప్రభాస్ కి సవాల్ విసురుతున్న వార్నర్

  • May 28, 2020 / 05:50 PM IST

సోషల్ మీడియా వేదికగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర పోస్ట్ తో వచ్చాడు. ఆయన ప్రభాస్ కాస్ట్యూమ్స్ తో తన కాస్ట్యూమ్స్ పోల్చుకోవడమే కాకుండా ఎవరి కాస్ట్యూమ్స్ బాగుందో చెప్పాలని నెటిజెన్స్ కి పోల్ పెట్టారు. కొన్నాళ్లుగా లాక్ డౌన్ కారణంగా క్రికెట్ మ్యాచ్ లకు బ్రేక్ పండించి. అంతర్జాతీయంగా క్రికెట్ మ్యాచ్ లు రద్దు కావడంతో ఈ స్టార్ క్రికెటర్ ఇంటికే పరిమితం అవుతున్నాడు. మరి ఇంట్లో ఖాళీగా ఉంటున్న వార్నర్ కి ఏమి తోచడం లేదు.

అందుకే ఆయన టిక్ టాక్ వీడియోలతో రెచ్చిపోతున్నారు. అవి కూడా మన టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్, మహేష్ సినిమా డైలాగ్స్ మరియు పాటలపై తన భార్యతో కలిసి వీడియోలు చేస్తున్నాడు. ఓ ఇంటర్నేషనల్ క్రికెటర్ టాలీవుడ్ హీరోల పాటలకు టిక్ టాక్ లు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఇక తాజా పోస్ట్ లో వార్నర్ బాహుబలి సినిమాలోని ప్రభాస్ ఫోటో పక్కన తన ఫోటో ఉంచి, ఎవరి కాస్ట్యూమ్ బాగుందో చెప్పండి అని నెటిజెన్స్ అభిప్రాయం అడిగారు.

వార్నర్ కూడా ఓ వారియర్ గెటప్ లో తయారై ఉండడం గమనార్హం. ఇక నెటిజెన్స్ తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. చాలా మంది ప్రభాస్ కి ఓటేస్తుంటే కొందరు క్రికెట్ ప్రియులు వార్నర్ కాస్ట్యూమ్ గుడ్ అని కామెంట్ పెడుతున్నారు. మొత్తంగా క్రికెటర్ గా క్రికెట్ ప్రియులకు మాత్రమే పరిచయమున్న వార్నర్ పేరు, ఈ టిక్ టాక్ వీడియోల తరువాత సినీ అభిమానులకు ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసిపోయింది. అలాగే ఆయన టిక్ టాక్ విడియోలను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా పెరిగిపోతుంది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus