Dayaa Review: దయా వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • August 5, 2023 / 05:31 PM IST

Cast & Crew

  • జేడీ చక్రవర్తి (Hero)
  • ఈషా రెబ్బా, రమ్యా నంబీసన్ (Heroine)
  • విష్ణు ప్రియ, 'జోష్' రవి, బబ్లూ పృథ్వీరాజ్, కమల్ కామరాజు, (Cast)
  • పవన్ సాధినేని (Director)
  • శ్రీకాంత్ మోహతా, మహేంద్ర సోని (Producer)
  • శ్రవణ్ భరద్వాజ్ (Music)
  • వివేక్ కాలెపు (Cinematography)

ఈ వీకెండ్ పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఓటీటీలో కూడా బోలెడన్ని సినిమాలు/వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో ‘దయా’ వెబ్ సిరీస్ కూడా ఒకటి. చాలా కాలం తర్వాత సీనియర్ హీరో జేడీ చక్రవర్తి నుండి వచ్చిన ప్రాజెక్ట్ ఇది. అలాగే చక్రవర్తి నటించిన మొదటి వెబ్ సిరీస్ కూడా! ‘సేనాపతి’ వంటి క్రేజీ మూవీని తెరకెక్కించిన దర్శకుడు పవన్ సాధినేని ఈ సిరీస్ కి దర్శకత్వం వహించాడు. దీంతో కొంతమంది ప్రేక్షకుల దృష్టి ఈ సిరీస్ పై పడింది. హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. 8 ఎపిసోడ్స్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కాబోతుంది. మరి ప్రేక్షకులను ఈ సిరీస్ ఎంత వరకు మెప్పించిందో ఓ లుక్కేద్దాం రండి :

కథ: దయా (జేడీ చక్రవర్తి) ఓ వ్యాన్ డ్రైవర్. ఫిష్ ట్రాన్స్‌పోర్ట్ చేసే ఫ్రీజర్ వ్యాన్ కి అతను డ్రైవర్ అనమాట. అతని భార్య అలివేలు (ఈషా రెబ్బా) తో హ్యాపీగా జీవిస్తూ ఉంటాడు. ఆమె నిండు గర్భిణీ. అయితే ఎప్పటిలానే ఓ రోజు పని మీదకి వెళ్ళిన దయా ఊహించని విధంగా ప్రమాదానికి గురవుతాడు. ఆ టైంలో అతని బండిలో డెడ్ బాడీ ఉంటుంది. అది ఎలా వచ్చి చేరింది? ఆ డెడ్ బాడీ ఎవరిది? జర్నలిస్ట్ కవిత (రమ్యా నంబీసన్) కథేంటి? ఆమె హైదరాబాద్ నుండీ కాకినాడ పోర్టుకు ఎందుకు వచ్చింది? మధ్యలో షబానా (విష్ణుప్రియ) ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? వీటన్నిటికీ చిక్కు ముడులు వేస్తూ దయా సిరీస్ ను రూపొందించాడు దర్శకుడు. వాటిని విప్పాలంటే సిరీస్ చూడాల్సిందే.

నటీనటుల పనితీరు: జేడీ చక్రవర్తి హీరోగానే కాకుండా విలక్షణ పాత్రలకి పెట్టింది పేరు.కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయనకి సరైన పాత్ర దొరకలేదు. ‘దయా’తో అతనికి ఆ ముచ్చట తీరింది అని చెప్పొచ్చు.ఆ పాత్రకి ఆయన జీవం పోసారని చెప్పొచ్చు. ఈ సిరీస్ ద్వారా ‘సత్య’ లో జేడీ కూడా కనిపించారు. అలాగే విశ్వరూపం లో కమల్ హాసన్ కూడా గుర్తొచ్చినా ఆశ్చర్యపడనవసరం లేదు.ఈషా రెబ్బా కి ఎక్కువ నిడివి కలిగిన పాత్ర దక్కలేదు. జర్నలిస్ట్ పాత్రలో రమ్యా నంబీసన్ బాగా చేసింది. కమల్ కామరాజు కూడా ఓకే! విష్ణు ప్రియ భీమనేని,కల్పిక గణేష్ , ‘జోష్’ రవి,పృథ్వీరాజ్ వంటి వారు ఉన్నంతలో మెప్పించారు.

సాంకేతిక నిపుణులు పనితీరు: దర్శకుడు పవన్ సాదినేని మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. సేనా పతి తో చాలా మందికి అది అర్థమైంది. కానీ ఆ మూవీకి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. అయితే దయ సిరీస్ కి మంచి రెస్పాన్స్ అందుతుంది అనడంలో సందేహం. వెబ్ సిరీస్ అంటే క్లాస్ గానే ఉంటుంది అనే అభిప్రాయాన్ని చెరిపేస్తుంది దయా అనడంలో అతిశయోక్తి లేదు. రైటింగ్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నేపథ్య సంగీతం కూడా సిరీస్ కి ప్రాణం పోసింది అని చెప్పాలి.శ్రవణ్ భరద్వాజ్ కి ప్రశంసలు దక్కుతాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. సీజన్ 2 కోసం ఇచ్చిన లీడ్స్ కూడా ఆకట్టుకుంటాయి. స్టార్టింగ్ ఎపిసోడ్స్ కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక్కసారి ఆ వరల్డ్ లోకి వెళ్ళాక అందరూ ఎంజాయ్ చేస్తారు.

విశ్లేషణ: డౌట్ లేకుండా తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్లలో దయ ది బెస్ట్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఈ వీకెండ్ కి మంచి టైం పాస్ సిరీస్. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. మిస్ కాకుండా చూసేయండి.

రేటింగ్ : 3/5

Click Here To Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus