బాహుబలి సినిమాతో రాజమౌళి సూపర్ స్టార్ అయిపోయారు. అతని సినిమాలో నటించాలని హీరోలు ఆరాటపడుతుంటే.. నిర్మాతలు కూడా అతనికోసం క్యూలో ఉన్నారు. తాజాగా పోలీసులు కూడా రాజమౌళి కోసం ప్రయత్నించి చివరికి పట్టుకున్నారు. డైరక్టర్ తప్పుచేసినందుకు పట్టుకోలేదు.. ఎవరూ తప్పు చేయకుండా ప్రచారం కల్పించాలని సంప్రదించారు. హైదరాబాద్ పోలీస్ డిపార్టుమెంటు తమ నూతన క్యాంపెయిన్ కోసం స్టార్ హీరోలను పక్కన పెట్టి, ‘బాహుబలి’తో టాక్ ఆఫ్ ది నేషన్ గా మారిన రాజమౌళిని కలిశారు. హైదరాబాద్ ట్రాఫిక్ 2 డీసీపీ ఎవి రంగనాథ్ ప్రజలలో ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంచేందుకు పోలీస్ డిపార్టుమెంటు చేపట్టనున్న చర్యలను రాజమౌళికి వివరించి, అందుకు తగిన విధంగా క్యాంపెయిన్ చేయడానికి సహాయ సహకారాలు అడిగినట్లుగా తెలిసింది.
సామాజిక బాధ్యత రీత్యా జక్కన్న కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. జూలై రెండవ వారంలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ‘బాహుబలి’ చిత్ర దర్శకుడు రాజమౌళితో పాటు, టైటిల్ రోల్ పోషించిన ప్రభాస్, రానాలు కూడా ప్రచారంలో లో భాగస్వామ్యులు కాబోతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.