3.5 మిలియన్ లైక్స్ దక్కించుకున్న తొలి డబ్బింగ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ “డియర్ కామ్రేడ్” హిందీ వెర్షన్
January 20, 2022 / 05:03 PM IST
|Follow Us
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ మూవీ మరో ఘనత సాధించింది. ఇప్పటివరకు మరే డబ్బింగ్ చిత్రానికి రానంతగా 3.5 మిలియన్ లైక్స్ డియర్ కామ్రేడ్ మూవీ హిందీ వెర్షన్ కు దక్కాయి. ఇది డబ్బింగ్ మూవీస్ లో సరికొత్తగా రికార్డ్ గా చెబుతున్నారు. ఇదే కాక అప్ లోడ్ చేసిన రెండేళ్లలో 300 మిలియన్ పైచీలుకు వ్యూస్ క్రాస్ చేసింది డియర్ కామ్రేడ్ హిందీ వెర్షన్. 2019 లో విజయ్ , రశ్మిక జంటగా తెరకెక్కిన చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. కొత్త దర్శకుడు భరత్ కమ్మ రూపొందించారు. 2019, జూలై 26న ప్రేక్షకుల ముందుకొచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా భావోద్వేగ ప్రేమ కథగా విజయాన్ని సాధించింది.
స్టూడెంట్ యూనియన్ లీడర్ బాబీ, స్టేట్ లెవెల్ వుమెన్ క్రికెటర్ లిల్లీ ప్రేమ కథ ప్రేక్షకుల మనసుకు హత్తుకుంది. తప్పును చూస్తే వెంటనే స్పందించే బాబి ఆ కోపం వల్ల చాలా కోల్పోవాల్సి వస్తుంది. క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ లైంగిక వేధింపుల కారణంగా లిల్లీ మానసికంగా కుంగిపోతుంది. ఈ కష్టాల నుంచి తన ప్రియురాలిని బాబి ఎలా కాపాడుకున్నాడు అనేది డియర్ కామ్రేడ్ కథ. ఈ కథలో విజయ్, రశ్మిక కెరీర్ బెస్ట్ పర్మార్మెన్స్ చేశారు.
అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకు ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసింది. దాంతో డియర్ కామ్రేడ్ మూవీని ఇతర భాషల్లో బాగా ప్రమోట్ చేశారు. హిందీ డబ్బింగ్ వెర్షన్ ను గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానెల్ అఫీషియల్ గా 2020 జనవరి 19న అప్ లోడ్ చేసింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ పెరుగుతూ ప్రస్తుతం 30 కోట్ల వ్యూస్ దాటేసిందీ స్పెషల్ మూవీ. 3.5 మిలియన్ లైక్స్ రావడం రేర్ ఫీట్ గా చెప్పొచ్చు. ఇవన్నీ హీరోగా విజయ్ కున్న ప్యాన్ ఇండియా క్రేజ్ ను చూపిస్తున్నాయి.