బాలయ్య పక్కన హీరోయిన్ గా నటిస్తే.. పెట్రోల్ పోసుకుని చచ్చిపోతాం : అభిమానులు

  • July 26, 2019 / 12:54 PM IST

అవును బాలకృష్ణ సినిమాలో మహేష్ సోదరి మంజుల ని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా మంజులే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ… ‘గతంలో నాకు హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. 1994లో నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో వచ్చిన ‘టాప్ హీరో’ చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఆ చిత్రంలో సౌందర్య ప్లేస్లో మొదట నన్నే హీరోయిన్ గా అనుకున్నారు. అయితే నాన్నగారి అభిమానులు మాత్రం నేను హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకోలేదు.

నేను హీరోయిన్ గా నటిస్తే పెట్రోల్ పోసుకుని చచ్చిపోతాం అంటూ స్టూడియో ముందు అభిమానులు వచ్చి నాన్నగారిని బెదిరించారు. వెంటనే మంజుల హీరోయిన్ గా నటించడంలేదంటూ నాన్నగారు ప్రకటన చేయడంతో వాళ్ళు వెనక్కి తగ్గారు. నన్ను వాళ్ళ సోదరిగా, ఇంటి ఆడపడుచుగా అభిమానులు భావిస్తుంటారు. అందుకే సినిమాల్లో నటించడానికి ఒప్పుకోలేదు. అందుకే నిర్మాతగా మారి.. ‘నాని’ ‘పోకిరి’ ‘ఏ మాయ చేసావే’ వంటి చిత్రాలు నిర్మించాను” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus