ఆనంద్ కరాజ్ కార్యక్రమం వల్ల దీపిక-రణ్వీర్ వివాహంపై వివాదం
November 20, 2018 / 08:05 AM IST
|Follow Us
బాలీవుడ్ ప్రేమ జంట దీపిక – రణ్వీర్ లు ఈ నెల 14 న ఇటలీలో చాలా గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. ఇటలీలోని లేక్ కోమోలోని విల్లా డెల్ బాల్బియానెల్లోలో వీరి వివాహం జరిగింది. ముందుగా ఈ నెల 14 వ తేదీన కొంకణి సంప్రదాయంలో వివాహం చేసుకోగా ఆ తరువాత 15 వ తేదీన సింధీ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి సందర్భంగా ఆనంద్ కరాజ్ అనే ఒక కార్యక్రమం నిర్వహించగా అది సిక్కు సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిందంటూ ఇప్పుడు వివాదంగా మారింది.
ఇటాలియన్ సిక్ ఆర్గనైజేషన్ వివాహ అనంతరం జరిగిన ఆనంద్ కరాజ్ అనే కార్యక్రమం సిక్కు సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిందంటూ ఆరోపించింది. సిక్కుల యొక్క పవిత్ర గ్రంథమైన ‘గురుగ్రంధ్ సాహిబ్’ ను గురుద్వారా లో తప్ప మరెక్కడా కూడా తీసుకోకూడదనే నిబంధనను వారు ఉల్లంఘించారని ఆ సంస్థ అధ్యక్షుడు ఆరోపించాడు. అంతేకాకుండా సిక్కుల కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘించి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఇదే విషయాన్ని ‘అకల్ తఖ్త్ జతేదార్’ దృష్టికి కూడా తీసుకువెళ్లారని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఐదుగురు అత్యున్నత మత పెద్దల దగ్గరికి తీసుకువెళ్లినట్లుగా ఆయన తెలిపారు. దీంతో వీరి వివాహం పైన వస్తున్న వివాదం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.