Deepika Padukone: గుండెకు సంబంధించిన సమస్యతో హాస్పిటల్లో జాయినైన దీపిక!
June 14, 2022 / 03:55 PM IST
|Follow Us
దీపికా పదుకొనే కి హార్ట్ బీట్ సమస్య తలెత్తడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం దీపికా పదుకొనే హైదరాబాద్‌లోనే ఉన్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కోసం ఆమె హైదరాబాద్‌లో ఉంటున్నారు. అయితే ఆమెకు సడెన్ గా హార్ట్ బీట్ సమస్య తలెత్తడంతో సిబ్బంది హైదరాబాదులో ఉన్న కామినేని ఆసుపత్రికి తరలించారు.చిన్నపాటి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు వైద్య నిపుణులు.ప్రస్తుతం దీపికా ను నోవాటెల్ హోటల్ లో అబ్జర్వేషన్లో పెట్టినట్లు తెలుస్తుంది.
హీరో ప్రభాస్, నిర్మాత అశ్వినీదత్, దర్శకుడు నాగ్ అశ్విన్ లు వెంటనే అప్రమత్తమయ్యారు అని తెలుస్తుంది. తమ అనుచరులను దీపికా వద్ద ఉంచి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి అని ఆదేశించారు. అయితే దీపికా ఆరోగ్యం బాగానే ఉంది. అది చిన్న పాటి పెయిన్ అని ప్రభాస్ సినిమా యూనిట్ చెబుతుంది.మొన్ననే 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న దీపికా పదుకొణె తన ఫ్యాషన్ గేమ్‌తో అందరి హృదయాలను కొల్లగొట్టింది.
అటు తర్వాత జూన్ 10న తన తండ్రి ప్రకాష్ పదుకొనే పుట్టినరోజు సందర్భంగా తిరుమల కూడా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈరోజు ఇలా ఈమె హాస్పిటల్ పాలు అవుతుంది అని ఎవ్వరూ అనుకోలేదు.ఇక ప్రభాస్ నటిస్తున్న ఈ మూవీ టైం మెషిన్ కాన్సప్ట్ తో తెరకెక్కుతుంది.
ఇది పాన్ వరల్డ్ మూవీ అని.. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుందని మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కూడా ఓ స్పెషల్ రోల్ ప్లే చేయబోతున్నారు.