ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత ఏర్పడుతోంది. స్టార్ హీరోలకు హీరోయిన్స్ దొరకడం కష్టంగా మారిపోయింది. ఇప్పటివరకు బాలకృష్ణ 100 వ సినిమాలో హీరోయిన్ కన్ఫర్మ్ కాలేదు. అలానే చిరంజీవి 150 వ సినిమాలో హీరోయిన్ గా అనుష్క కన్ఫర్మ్ అయిందనుకుంటే సడెన్ గా అమ్మడు హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు చిరు సరసన హీరోయిన్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే బాలీవుడ్ అగ్ర తార దీపికా పడుకొనే అయితే చిరు సినిమాలో బావుంటుందనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. దీపికా అయితే ఈ సినిమాకు మరింత హైప్ వచ్చే ఛాన్స్ ఉంది. పైగా దక్షిణాది చిత్రాల్లో దీపిక నటించింది లేదు. దాంతో.. దీపిక కాల్షీట్ల కోసం గట్టిగా ట్రై చేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే దీపిక అంత తేలిగ్గా పడే రకం కాదు.
ఇది వరకు యంగ్ హీరోల సరసన నటించే ఆఫర్లు వచ్చినప్పుడే దీపిక నో చెప్పింది. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూళ్ల కారణంగా దీపిక డేట్లు సర్దుబాటు చేయడం అసాధ్యమే. అందుకే… ఇదంతా ఉత్తిత్తి పుకారుల్లో భాగమని ఫిల్మ్‌నగర్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఒకవేళ సడన్ గా చిరు పక్కన దీపిక ఎంట్రీ ఖాయమైపోతే..టాలీవుడ్ మొత్తం ఆశ్చర్యపోవాల్సిందే. కానీ ఇది జరిగేపనిలా అయితే కనిపించట్లేదు.