యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఓ డియర్’ లేదా ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ అనుకుంటున్నారు. ఇక ‘బాహుబలి’ ‘బాహుబలి2’ చిత్రాలకి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. ఆ చిత్రాలకు రెండు పార్ట్ లకు కలిపి లాభాల్లో వాటాగా 80 కోట్ల వరకూ అందుకున్నాడు. ఇక ‘సాహో’ చిత్రానికి ఎటువంటి పారితోషికం తీసుకోలేదు అని ప్రభాస్ చెప్పాడు. వాళ్ళ స్నేహితులే కాబట్టి… నిజంగానే తీసుకుని ఉండకపోవచ్చు.
ఆ చిత్రం ప్లాప్ టాక్ తో కూడా 230 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 150 కోట్ల వరకూ అందినట్టు సమాచారం దాంతో… ఆ చిత్రం నిర్మాతలకు సేఫ్ వెంచర్ అనే చెప్పాలి. ఇక తన తరువాతి చిత్రానికి కూడా లాభాల్లో వాటా లేదా నాన్ థియేట్రికల్స్ రైట్స్ రూపంలో 60 కోట్ల వరకూ అందుకునే అవకాశం కూడా ఉందట. ఇక ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ లో ప్రభాస్ చేసే చిత్రానికి దాదాపు 80 కోట్ల వరకూ అందుకునే అవకాశం ఉందట.
ఇక సినిమాలను పక్కన పెడితే ప్రభాస్ తండ్రి సూర్య నారాయణరాజు గారు చెన్నై లో స్థలాలను అప్పటి రోజుల్లోనే కొనుగోలు చేసారట. ఇక హైదరాబాద్ సమీపంలో కూడా స్థలాలు ఉన్నాయట. ప్రభాస్ కు ప్రస్తుతం 4 కార్లు ఉన్నాయి. హైదరాబాద్ లో రెండు ఇల్లు ఉన్నాయి. బెంగుళూరు నగరంలో కూడా స్థలం ఉందట. అంతే కాకుండా గ్రానైట్ భూమి, కొబ్బరి తోటలు వంటివి కూడా ఉన్నాయట. మొత్తంగా కలుపుకుంటే సుమారు 6.5 వేల కోట్లు ఉంటుందని తెలుస్తుంది. ఆస్తుల విషయాల్లో కూడా ప్రభాస్ బాహుబలే అని వీటితో స్పష్టం అవుతుంది.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
Most Recommended Video