DSP: ప్రతి సినిమా సవాల్ గానే ఉంటుంది… దేవిశ్రీ కామెంట్స్ వైరల్!

  • January 13, 2023 / 03:57 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాకు సంబంధించి పలు విషయాలను తెలియచేశారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో పూనకాలు లోడింగ్ బాసు పార్టీ అనే పాటలు ఎలాంటి సక్సెస్ సాధించాయో మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈ రెండు పాటలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.ఇక ఈ పాటల గురించి దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ తాను స్క్రీన్ పై అన్నయ్య ఎలా ఉంటారో ముందుగా ఊహించి ఈ పాటలకు కంపోజ్ చేశానని తెలిపారు. ప్రతి ఒక్క సినిమాకు మ్యూజిక్ అందించడం అంటే పెద్ద సవాల్ అయితే ఎప్పుడు కూడా ఒత్తిడితో పనిచేయకూడదని ఈయన తెలిపారు. ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్క పాట హిట్ కావడానికి గల కారణం డైరెక్టర్ కథ పై, నాపై పెట్టుకున్న నమ్మకమే కారణమని తెలిపారు.

అన్నిటికి మించి చిరంజీవి గారు మా ఇద్దరిపై పెట్టుకున్న నమ్మకం అని కూడా చెప్పాలి. ఇక డైరెక్టర్ బాబీ చిరంజీవి గారితో ఎప్పటినుంచో సినిమా చేయాలని అనుకుంటున్నారు అయితే వాల్తేరు వీరయ్య సినిమాతో బాబీ కల నెరవేరిందని అందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా దేవి శ్రీ ప్రసాద్ వెల్లడించారు.

ఇక ఈ సినిమాలో ప్రేక్షకులు చిరంజీవి గారి నుంచి ఏదైతే కోరుకుంటారో అలాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్ అద్భుతంగా ఉందని, రవితేజ ఎంట్రీ అయిన తర్వాత క్లాప్స్ కొడుతూ కన్నీళ్లు పెట్టుకుంటారంటూ ఈ సందర్భంగా దేవిశ్రీప్రసాద్ ఈ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus