దేవి శ్రీ ప్రసాద్.. ఈయన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. 2018 వరకూ ఈయనే టాప్ లో ఉండేవాడు. కానీ 2019 నుండీ కాస్త వెనుక పడ్డాడు. ఆయన పెద్ద సినిమాలకే సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నప్పటికీ ఎందుకో చార్ట్ బస్టర్స్ ఇవ్వలేకపొతున్నాడు. అలా చెత్త మ్యూజిక్ ఇస్తున్న్నాడు అని వంకలు పెట్టాల్సిన అవసరం లేదు. గతేడాది నుండీ దేవి సంగీతం అందించిన సినిమాలు ‘వినయ విధేయ రామ’ ‘ఎఫ్2’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాల పాటలు.. ఆయన స్థాయి ఆల్బమ్స్ కాదు అనేది ప్రేక్షకుల వాదన. అయితే ‘చిత్రలహరి’ సినిమాకి మాత్రం మంచి మ్యూజిక్ అందించాడు. సరే ఇప్పుడు అసలు మ్యాటర్ కు వద్దాం.. దేవి ఎప్పుడూ కొత్త సింగర్స్ ను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. గతంలో ఈయన.. ఆ విషయంలో అనేక సార్లు ప్రశంసలు కూడా అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సిద్ శ్రీరామ్ ను ఎందుకు దేవి పట్టించుకోవట్లేదు అనేది చర్చనీయాంశం అయ్యింది.
‘గీత గోవిందం’ సినిమాలో ‘ఇంకేం ఇంకేం కావాలె’ పాట పాడినప్పటి నుండీ సిద్ శ్రీరామ్ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. అతని గాత్రం యూత్ కు విపరీతంగా నచ్చేసింది. అటు తర్వాత ‘టాక్సీ వాలా’ లో ‘మాటే వినదుగా’, ‘హుషారు’ లో ‘ఉండిపోరాదే’ ఇక ఈ ఏడాది విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో ‘సమాజవరగమన’ పాటలు.. సిద్ స్థాయిని అమాంతం పెంచేసాయి. ఇప్పుడు సిద్ శ్రీరామ్ చాలా బిజీ అయిపోయాడు. అయితే ఇతన్ని ‘దేవి ఎందుకు పట్టించుకోవట్లేదు. ఇతని వాయిస్ నచ్చలేదా? లేక ఇతనేమైనా పేమెంట్ ఎక్కువ అడిగే సింగర్ అని పక్కన పెడుతున్నాడా ‘ అని రక రకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే దేవి మ్యూజిక్ లో సిద్ శ్రీరామ్ ఓ పాట పాడితే.. అది వినాలని దేవి అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మరి వారి కోరికను దేవి ఎప్పుడు తీరుస్తాడో చూడాలి..!