మహేష్ సినిమాకి మూడు సాంగ్స్ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్
March 18, 2017 / 01:42 PM IST
|Follow Us
మహేష్ 23 వ సినిమా సంగతి ఏమోగానీ, 24 వ మూవీ మాత్రం చాలా ఫాస్ట్ గా ఉంది. సూపర్ స్టార్ ప్రస్తుతం ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావస్తున్నప్పటికీ టైటిల్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీని తరవాత కొరటాల శివ దర్సకత్వంలో చేయనున్న సినిమా టైటిల్ మాత్రం ఫిక్స్ అయిపోయింది. మహేష్ 24 మూవీకి “భరత్ అను నేను” అని షూటింగ్ ప్రారంభం కాకముందే ప్రకటించేశారు. ప్రిన్స్ ముఖ్యమంత్రిగా నటించనున్న ఈ ఫిల్మ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని ఏప్రిల్ చివరినాటికి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో కొరటాల శివ శ్రమిస్తున్నారు.
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ నుంచి అద్భుతమైన మూడు ట్యూన్స్ రాబట్టినట్లు తెలిసింది. వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ సారి కూడా బ్లాక్ బస్టర్ అందుకోవాలని దేవీ సూపర్ పాటలను కంపోజ్ చేసి రికార్డింగ్ కంప్లీట్ చేసినట్లు తెలిసింది. ఎన్నో అంచనాలు నెలకొని ఉన్న ఈ చిత్రం మే మొదటి వారం నుంచి యూరప్ లో తొలి షెడ్యూల్ జరుపుకోనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.