ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదు… క్షమించండి: త్రినాధ రావు
December 22, 2022 / 10:16 PM IST
|Follow Us
సాధారణంగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క సినిమా కూడా ఏదో ఒక వివాదాన్ని ఎదుర్కొంటూ పెద్ద ఎత్తున సినిమాని బహిష్కరించాలి అంటూ డిమాండ్లు వ్యక్తం చేస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు బైకాట్ నిరసనలను ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలోనే రవితేజ తాజాగా నటించిన ధమాకా సినిమాకి కూడా ఇలాంటి నిరసనలు వ్యక్తం అయ్యాయి. త్రినాథ్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రవితేజ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి ధమాకా సినిమా ఈనెల 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఫ్రీ రిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా వేడుకలో భాగంగా డైరెక్టర్ త్రినాథ్ రావ్ ఉప్పర కులస్తులను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ తీవ్రదుమారం రేపాయి. ఈ సందర్భంగా ఫ్రీ రిలీజ్ వేడుకలో త్రినాథ్ రావు మాట్లాడుతూ నీ ఉప్పర లొల్లి ఏంటి అని మాట్లాడారు ఈ క్రమంలోనే ఉప్పర సంఘం కులస్తులు మొత్తం డైరెక్టర్ త్రినాథ్ కించపరిచే విధంగా మాట్లాడారని తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఫిలిం ఛాంబర్ ఎదుట ఉప్పర కులస్తుల సంఘం నేతలు బైఠాయించి డైరెక్టర్ త్రినాథ్ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా పెద్ద ఎత్తున ఉప్పర కులస్తులు డైరెక్టర్ పై విమర్శలు చేయడంతో డైరెక్టర్ ఉప్పర కులస్తులకు క్షమాపణలు చెప్పారు.తాను ఎవరిని కించపరచాలన్న ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఉప్పర అనే పదాన్ని నా సినిమాలో కూడా వాడాను అయితే నాపై ఉన్న కోపాన్ని సినిమాపై ఎవరూ చూపించద్దని
ఉప్పర కులస్తులు కూడా రవితేజ అభిమానులలో భాగమని ఈయన చెప్పుకొచ్చారు. ఇలా తెలియకుండా మాట్లాడినందుకు ప్రతి ఒక్కరు కూడా నన్ను క్షమించాలని ఇకపై సినీ నటులే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఉప్పర అనే పదాన్ని బహిష్కరించాలని ఈ సందర్భంగా త్రినాథ్ రావు క్షమాపణలు చెబుతూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.