Dhanush, Sekhar Kammula: ధనుష్ శేఖర్ కమ్ముల మూవీలో లక్కీ హీరోయిన్.. కానీ?

  • October 15, 2022 / 11:56 AM IST

ధనుష్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ధనుష్ శేఖర్ కమ్ముల కాంబో మూవీలో రష్మిక హీరోయిన్ గా నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న రష్మికకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం రష్మిక పుష్ప ది రూల్ సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుంటానని రష్మిక నమ్ముతున్నారు. శేఖర్ కమ్ముల సినిమాలో నటిస్తే హీరోయిన్ కు ఏ స్థాయిలో పేరు వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రష్మిక తన సినీ కెరీర్ లో గ్లామరస్ రోల్స్ కంటే అభినయ ప్రధాన పాత్రలకే ఓటేస్తున్నారు. విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉన్నారని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు వైరల్ కాగా రష్మిక మాత్రం ఆ వార్తల్లో నిజం లేదనే విధంగా స్పందిసుండటం గమనార్హం. రష్మిక ఒక్కో ప్రాజెక్ట్ కు 5 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

రష్మిక కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. విజయ్ దేవరకొండ రష్మిక కలిసి నటించాలని మరి కొందరు అభిమానులు కోరుకుంటున్నారు. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో కూడా బిజీ అవుతున్నారు. సినిమాసినిమాకు నటిగా రష్మిక రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. రష్మిక రాజకీయాల్లోకి వస్తారని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల గురించి ఆమె స్పందించడం లేదు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus