“విఐపి 2” డిఫరెంట్ సినిమా కాదు.. సిమిలర్ సినిమా! : ధనుష్
July 8, 2020 / 12:01 PM IST
|Follow Us
నటుడిగా ప్రతి సినిమాతోనూ ఒక్కో మెట్టు ఎక్కుతూనే దర్శకుడిగా, గాయకుడిగా, రచయితగా తన స్థాయిని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు ధనుష్. ఆయన నటించిన తాజా చిత్రం “విఐపి 2”. తమిళం-తెలుగులో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ చిత్రానికి సౌందర్య రజనీకాంత్ దర్శకురాలు. తమిళనాట ఆగస్ట్ 11న విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న ఈ చిత్రం తెలుగులో ఆగస్ట్ 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైద్రాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ధనుష్ “విఐపి 2” చిత్ర విశేషాలతోపాటు తన హాలీవుడ్ సినిమా గురించి, అక్కడ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి, తన తదుపరి చిత్రాల గురించి పంచుకొన్నారు.
ఇదే పర్ఫెక్ట్ ఫిలిమ్ అనిపించింది..
“రఘువరన్ బీటెక్” తెలుగులోనూ సూపర్ హిట్ అవ్వడంతో.. నా తెలుగు డెబ్యూకి ఇదే పర్ఫెక్ట్ ఫిలిమ్ అనుకొన్నాను. అందుకే “విఐపి 2” చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగులోనూ ఏకకాలంలో చిత్రీకరించాం.
డిఫరెంట్ గా ఉండదు, సిమిలర్ గా ఉంటుంది..
“రఘువరన్ బీటెక్ అండ్ విఐపి 2” డిఫరెంట్ గా ఉండవు, చాలా సిమిలర్ గా ఉంటాయి. ఉన్న తేడా అల్లా రఘువరన్ మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలా సాగింది అనేది మెయిన్ కాన్సెప్ట్.
సౌందర్య న్యాయం చేస్తుందనిపించింది..
నేను స్క్రిప్ట్ రాసుకొన్నాక.. సౌందర్య అయితేనే ఈ సినిమాకి న్యాయం చేస్తుందని అనిపించింది. ముఖ్యంగా నా క్యారెక్టరైజేషన్ ను మొదటి భాగం స్థాయిని మించి ఎలివేట్ చేశాను. ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ ఫన్నీగా నా క్యారెక్టర్ ఉంటుంది.
కాజోల్ అయితేనే సెట్ అవుతుంది అనిపించింది..
మేం తీస్తున్నది మల్టీలింగువల్ సినిమా. నేను రాసిన పాత్రకి ఒక హుందాతనం గల నటి కావాలి. కాజోల్ గారికి కథ చెప్పడం ఆవిడ నటించడంతో సినిమా రీచ్ పెరిగింది. హిందీలో రిలీజ్ చేయడానికి ఒన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హెల్ప్.
ఎంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నా టాలెంట్ లేకపోతే వేస్టే..
ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంది కదా అని ప్రేక్షకులు అందర్నీ ఆదరించరు. మనిషిలో టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ ను గుర్తించినప్పుడే ఆ పర్సన్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతాడే తప్ప.. ఎలాంటి బ్యాగ్రౌండ్ ఉపయోగపడదు.
ఆరు నెలల ముందే అంతా రెడీగా ఉంటుంది..
ప్రస్తుతం తమిళం, హిందీతోపాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నాను. అయితే.. సౌత్ సినిమాలతో పోల్చి చూస్తే.. హాలీవుడ్ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే.. ప్రీప్రొడక్షన్ వర్క్. అక్కడ సినిమా షూటింగ్ మొదలవ్వడానికి ఆరు నెలల ముందే అంతా సిద్ధమవుతుంది. అందువల్ల పని రోజులు తగ్గుతాయి, దానివల్ల ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఆ అలవాటు మన సౌత్ సినిమాల్లోనూ వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను.
ఇక నుంచి ద్విభాషా చిత్రాలు ఎక్కువగా చేయాలనుకొంటున్నాను..
నా తదుపరి చిత్రం “వాడా చెన్నై” తెలుగులో డబ్ అవుతుంది. ఆ తర్వాత చేయబోయే “మారి 2” మాత్రం తమిళంతోపాటు తెలుగులోనూ ఏకకాలంలో పిక్చరైజ్ చేయనున్నాను. ఇకపై తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకొంటున్నాను.
మేల్ డైరెక్టర్.. ఫీమేల్ డైరెక్టర్ అన్న తేడా లేదు..
నా దృష్టిలో డైరెక్షన్ అనేది ఒక బాధ్యత. దాన్ని ఎవరైనా నిర్వర్తించవచ్చు. అందులో మేల్ డైరెక్టరా, ఫీమేల్ డైరెక్టరా అనే విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు.
నా దగ్గర బోలెడు కథలున్నాయి..
నేను ఒకపక్క నటుడిగా సినిమాలు చేస్తూనే.. మరోపక్క కథలు రాసుకొంటున్నాను. ఇప్పుడు కూడా నా దగ్గర రెండు స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. ఏ స్క్రిప్ట్ మీద వర్క్ చేయాలన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాను.
నా దృష్టిలో పని చేయడమే పెద్ద రిలాక్సేషన్..
వరుసబెట్టి సినిమాలు చేస్తుంటాను కదా ఎప్పుడు రిలాక్స్ అవుతారు అని చాలా మంది అడుగుతుంటారు. కానీ.. నాకు వర్క్ చేయడమే రిలాక్సేషన్. చిన్నపిల్లలు ఆడుకోవడాన్ని ఎలా ఎంజాయ్ చేస్తారో నేను పని చేయడం అలా ఎంజాయ్ చేస్తాను.