Dhee Collections: ‘ఢీ’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • April 13, 2022 / 10:21 PM IST

మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఢీ’. దివంగత నటుడు శ్రీహరి కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. ‘సిరి వెంకటేశ్వర ఫిలింస్‌’ బ్యానర్ పై మల్లిడి సత్యనారాయణరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి చక్రి సంగీతం అందించారు. మంచు విష్ణు కెరీర్లో 5వ సినిమా ఇది. 2007 వ సంవత్సరం ఏప్రిల్ 13న ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

Click Here To Watch Trailer

కోన వెంకట్, గోపి మోహన్ ల పంచ్ డైలాగ్స్, బ్రహ్మానందం కామెడీ, శ్రీను వైట్ల దర్శకత్వం కలగలిపి ఈ చిత్రాన్ని సూపర్ హిట్ గా నిలబెట్టాయి. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 15 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

మరి బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 4.21 cr
సీడెడ్ 1.57 cr
ఉత్తరాంధ్ర 1.02 cr
ఈస్ట్ 0.56 cr
వెస్ట్ 0.57 cr
గుంటూరు 0.68 cr
కృష్ణా 0.62 cr
నెల్లూరు 0.46 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 9.69 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 1.35 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 11.04 cr

‘ఢీ చిత్రానికి’ చిత్రానికి రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.11.04 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో బయ్యర్లకు రూ.6.04 కోట్ల లాభాలు దక్కినట్టు అయ్యింది. దీంతో ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విష్ణు కెరీర్లో మొదటి కమర్షియల్ హిట్ మూవీ ఇదే అని చెప్పాలి. రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ శాటిలైట్ హక్కులని అమ్మడంతో నిర్మాతకి మంచి లాభాలు దక్కాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus