బిగ్‌బాస్4: ఆ రోజు రాత్రి నేనే ఆస్పత్రికి వెళ్లా!
October 16, 2020 / 08:29 AM IST
|Follow Us
బిగ్‌బాస్ ఇంటికి వచ్చినవాళ్లందరి నవ్వుల వెనుక, సరదాల వెనుక.. చాలా పెద్ద కథే ఉంటుంది. అలా ఈ సీజన్లో ఇంట్లో అందరినీ నవ్విస్తున్న, అందరితో సరదాగా ఉంటున్న హారిక వెనుక కూడా పెద్ద కథే ఉంది. జీవితంలో డిజైనర్ బెడ్రూమ్లో ఆనందమయ జీవితాన్ని గడిపిన హారిక… బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చే మధ్యలో చాలా జరిగాయి. ఆమె జీవితంలో సినిమాటిక్ మలుపులు చాలా ఉన్నాయ్. వాటిని గురువారం బిగ్‌బాస్ ఇంట్లో చెప్పుకొచ్చింది.
ఇంటర్మీడిట్ వరకు హారిక జీవితం ఎంతో ఆనందంగా సాగింది. ఇల్లు, కాలేజీ, స్నేహితులు అంటూ బిందాస్‌గా లైఫ్ సాగించింది. ఇంటర్ ఆఖరులో ఒక రోజు ఆమె అమ్మ పిలిచి… ‘నాన్నా నేను విడిపోతున్నాం. నువ్వు నాన్న దగ్గర ఉండు.. నేను అమ్మమ్మ దగ్గర ఉంటా’ అని చెప్పింది. దీంతో అన్నయ్యతో కలసి హారిక తండ్రి దగ్గరే ఉంది. కొన్నాళ్లకు అన్నయ్య తల్లి దగ్గరకు వెళ్లిపోయాడు. హారిక నాన్న దగ్గరే ఉండేది. వేసవి కాలంలో సరైన ఆహారం ఉండక… పికిల్తోనే రోజూ భోజనం చేసింది. దీంతో ఆమె పొట్టలో గ్యాస్ ఫామ్ అయ్యి… ఓ రోజు రాత్రి బాగా ఇబ్బంది పడింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేవాళ్లు కూడా లేక.. ఆమెను బైక్ డ్రైవ్ చేసుకొని ఆస్పత్రికి వెళ్లింది. ఓ ఇంజిక్షన్ చేయించుకుంది.
హారిక పరిస్థితిని గమనించిన ఆమె తల్లి… హారికను తనతో పాటు తీసుకెళ్లిపోయింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే… హారిక ఏకంగా తండ్రి పేరును మరచిపోయింది. అంతగా అతనికి దూరమైంది. ‘‘డాడీ ఈ ఐదేళ్లలో నీ దగ్గర నుంచి దూరం వచ్చేశాం. మీరెప్పుడూ తిరిగి చూడలేదు. మేమెప్పుడు తిరిగి చూడలేదు. తిరిగి చూసిన రోజు మేం ఆగిపోతాం అని తెలుసు. మేం తిరిగి చూడం. అయినా ఒక విషయం చెబుతున్నా నాన్నా లవ్ యూ’ అంటూ తను మానసికంగా ఎంత ధృడమో చెప్పకనే చెప్పింది హారిక.
మా అన్నలు చూడటం లేదు. అయినవాళ్లు చూడటం లేదు హారిక వాళ్ల అమ్మ అంటుంటుందట. దానికి హారిక మరోసారి సమాధానం చెప్పింది. ‘నిన్ను ఎవరో చూడటం లేదు అనుకోకు. నీకు మేం ఉన్నాం. మన ముగ్గురికి మన ముగ్గురుమే. నువ్వు లేని రోజు నేను లేను’’ అని అంది హారిక. అన్నయ్య గురించి చెబుతూ మా నాన్న మా అన్నయ్య అని చెప్పింది హారిక.
హారిక చిన్నతనం నుంచే అన్నీ ఉన్న జీవితం అనుభవించింది. ఆమె కోసం డిజైనర్ బెడ్ ఉండేది అంటే అర్థం చేసుకోండి. అలాంటిది ఆ తర్వాత తన తల్లి కష్టపడిత సంపాదిస్తే జీవించే పరిస్థితికి వచ్చింది. ఆమె తల్లి పోరాటతత్వమే మళ్లీ వారిని ఈ స్థాయికి వచ్చేలా చేసింది. బిగ్‌బాస్ ఇంట్లో హారిక ఇలా పోరాడుతూ అందరి మన్ననలు పొందుతుందోంటే తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన ఆ ధైర్యం, పోరాటతత్వమే అన్నమాట. బ్రేవ్ హారిక కదా. అందుకే ఇక్కడివరకు వచ్చింది.