Sakshi Dhoni: ఆ టాలీవుడ్ హీరో సినిమాలు మాత్రమే చూస్తాను… ధోనీ వైఫ్ సాక్షి కామెంట్స్ వైరల్!

  • July 25, 2023 / 06:12 PM IST

క్రికెట్ రంగంలో ఎన్నో సరికొత్త రికార్డులను సృష్టించి క్రికెటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎంఎస్ ధోని ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన సొంత బ్యానర్ ప్రారంభించి LGM అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూలై 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాదులో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ధోని వైఫ్ సాక్షి సింగ్ పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు ధోని వైఫ్ సాక్షిని ప్రశ్నిస్తూ.. మీరు టాలీవుడ్ హీరోల సినిమాలు చూస్తారా చూస్తే ఏ హీరో సినిమాలు చూస్తారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సాక్షి (Sakshi Dhoni) సమాధానం చెబుతూ..

తాను పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ సినిమాలు మాత్రమే చూస్తానని తెలిపారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అల్లు అర్జున్ సినిమాలు మిస్ కాకుండా చూస్తాను అంటూ ఈ సందర్భంగా సాక్షి సింగ్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సాక్షి సింగ్ అల్లు అర్జున్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ధోని వంటి ఒక స్టార్ క్రికెటర్ సతీమణి అల్లు అర్జున్ కి వీరాభిమాని అని తెలియడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ధోని నిర్మాణంలో రాబోతున్నటువంటి మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై తమిళంలోనూ తెలుగులోనూ భారీ అంచనాలే ఏర్పడ్డాయి. క్రికెట్ రంగంలో సక్సెస్ సాధించినటువంటి ధోని సినీ ఇండస్ట్రీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. మరి సినీ ఇండస్ట్రీలో కూడా ధోని సక్సెస్ కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus