Rohini: 28వ వసంతంలోకి రౌడీ రోహిణీ.. గిఫ్ట్‌గా డైమండ్ రింగ్, ఎవరిచ్చారంటే..?

  • October 29, 2021 / 11:44 AM IST

బుల్లితెర నటి, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ప్రతిభతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుందీ. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినా.. తన కృషి, పట్టుదలతో మళ్లీ అవకాశాలను చేజిక్కించుకుంది రోహిణి. ఈ నేపథ్యంలోనే పైసా పైసా కూడబెట్టి ఇటీవల తన సొంతింటి కలను నిజం చేసుకుంది. హైదరాబాద్‌ మణికొండలో డూప్లెక్స్‌ హౌస్‌ను కొనుగోలు చేసింది రోహిణి. ఈ విషయాన్ని ఇటీవలే అభిమానులతో పంచుకుని మురిసిపోయింది. తన తల్లికి కొత్త ఇల్లు చూపిస్తూ ఉద్వేగానికి గురైంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ తన 28వ పుట్టినరోజును జరుపుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను రోహిణి యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన యాంకర్స్ శివజ్యోతి, లాస్య కూడా హాజరయ్యారు. తన బెస్టీ కోసం ఎన్నో బహుమతులు పట్టుకొచ్చారు ఆమె సన్నిహితులు. ఎవరెన్ని గిఫ్ట్‌లు ఇచ్చినా ఫ్యామిలీ ఇచ్చే బహుమతి ప్రత్యేకం కదా. అలాగే రోహిణికి కూడా ఆమె కుటుంబం సర్‌ప్రైజ్ ఇచ్చింది.

కూతురికి డైమండ్ రింగ్‌ను ప్రజేంట్ చేశారు రోహిణి మదర్. అది చూసి ఉద్వేగానికి గురైంది రౌడీ. తనకు వజ్రపు ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇచ్చిన అమ్మ, సోదరిని కౌగిలించుకున్న రోహిణీ కాసేపు అలాగే ఉండిపోయింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు షోలలో నటిస్తోంది. అలాగే యూట్యూబర్‌గానూ రాణిస్తోంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!


సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus