Kajal Aggarwal: ఆ విషయంలో కాజల్ సమంతను ఫాలో అయ్యారా?

  • October 27, 2022 / 02:29 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో పాటు వరుస ప్రాజెక్ట్ లతో బిజీ కావాలని అనుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ కు సోషల్ మీడియాలో కూడా భారీగా క్రేజ్ ఉంది. వివాదాలకు దూరంగా ఉండే కాజల్ సక్సెస్ రేట్ కూడా ఎక్కువేననే సంగతి తెలిసిందే. తారక్, చరణ్ లకు కాజల్ జోడీగా నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. అయితే తాజాగా కాజల్ అగర్వాల్ తన పెదవులకు సర్జరీ చేయించుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాజల్ అగర్వాల్ కొత్త ఫోటోలను చూసిన నెటిజన్లు ఈ కామెంట్లు చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం సమంత సర్జరీ చేయించుకోగా కాజల్ కూడా ఈ విషయంలో సమంతను ఫాలో అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కాజల్ ముఖంలో మార్పు కనిపిస్తుండటంతో కాజల్ అభిమానులు ఈ కామెంట్లు చేస్తున్నారు. సర్జరీ వార్తల గురించి కాజల్ అగర్వాల్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కాజల్ ముఖంలో స్పార్క్ మిస్ అయిందని గతంలోనే కాజల్ అందంగా కనిపించారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రీఎంట్రీలో కాజల్ అగర్వాల్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కాజల్ ఒక్కో ప్రాజెక్ట్ కు ప్రస్తుతం 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. కాజల్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంటుంది. యంగ్ జనరేషన్ స్టార్ హీరోలకు జోడీగా కాజల్ అగర్వాల్ కు ఆఫర్లు తగ్గడంతో సీనియర్ హీరోలకు జోడీగా నటించడానికి కాజల్ అగర్వాల్ ఓకే చెబుతున్నారు.

కాజల్ వయస్సు ప్రస్తుతం 37 సంవత్సరాలు కాగా వయస్సు పెరుగుతున్నా ఆఫర్లను సొంతం చేసుకుంటూ కాజల్ అగర్వాల్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుండటం గమనార్హం. కాజల్ అగర్వాల్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus