Katrina Kaif: బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన కత్రినా ఎంగేజ్మెంట్!
November 8, 2021 / 04:55 PM IST
|Follow Us
స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతుందంటూ బాలీవుడ్ మీడియాలో కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా కత్రినా.. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ చేస్తోంది. మొన్నామధ్య అనీల్ కపూర్ కొడుకు ఓ టీవీ షోలో ఈ విషయాన్ని కన్ఫర్మ్ కూడా చేసేశాడు. కానీ కత్రినా-విక్కీ మాత్రం ఎక్కడా నోరు విప్పడం లేదు. తాజాగా వీరిద్దరి నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలు ఇవేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే అవి ఎంగేజ్మెంట్ ఫొటోలా..? దీపావళి వేడుకకు సంబంధించిన ఫొటోలా..? అనే విషయంలో క్లారిటీ లేదు. ఇద్దరూ రింగులు మార్చుకున్నట్లుగా ఎక్కడా లేదు. కేవలం సంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు. కత్రినా కూడా ఈ విషయంలో అసలు మాట్లాడడం లేదు. ఆమె తన సోషల్ మీడియాలో ఎక్కడా పెళ్లి ప్రస్తావన, నిశ్చితార్ధం గురించి హింట్ ఇవ్వలేదు. దీపావళికి శుభాకాంక్షలు చెబుతూ.. సంప్రదాయ చీరలో దిగిన ఫొటోలు మాత్రం అప్డేట్ చేసింది. కత్రినా వయసు 37 సంవత్సరాలు.
తన పదిహేనేళ్ల సినీ జీవితంలో ఆమె సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ లాంటి హీరోలతో డేటింగ్ చేసింది. రణబీర్ ని పెళ్లి చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఏమైందో కానీ ఇద్దరికీ బ్రేకప్ అయింది. అందుకే ఈసారి తన రిలేషన్షిప్ గురించి ఎక్కడా ఓపెన్ అవ్వడం లేదని కత్రినా. ఇటీవల కత్రినా నటించిన ‘సూర్యవంశీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.