పవన్ కళ్యాణ్ సినిమాలోని ఈ పాప ఓ ప్రముఖ నటుడి కూతురట..!

  • February 25, 2022 / 09:46 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన ఆల్ టైం హిట్.. ‘బద్రి’ మూవీని అంత ఈజీగా ఎవ్వరూ మరిచిపోలేరు. హీరోయిజానికి సరికొత్త డెఫినిషన్ చెప్పిన మూవీ అది.ఇద్దరి అమ్మాయిలను పేమించి నలిగిపోయే ఓ యువకుడిగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కనిపిస్తాడు.అమిషా పటేల్, రేణు దేశాయ్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం నుండే హీరోయిన్ రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ ల మధ్య పరిచయం ఏర్పడడం.. తరువాత వీళ్ళు దగ్గరవ్వడం జరిగింది.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో బద్రి(పవన్ కళ్యాణ్) పార్క్ లో దిగులుగా కూర్చొని ఉంటాడు. ఆ టైములో ఓ పాప అతని వద్దకు వచ్చి ఎందుకు దిగులుగా ఉన్నారు అన్నట్టు పలకరిస్తుంది. అప్పుడు బద్రి.. ‘నాకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు’ అని సమాధానం ఇస్తాడు. దానికి ఆ పాప ‘నాకు కూడా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు’ అంటూ ఫన్నీ ఆన్సర్ ఇస్తుంది. ఆ పాప ఇప్పుడు హీరోయిన్ కూడా అయ్యింది. అంతేకాదు ఆమె ఓ ప్రముఖ నటుడి కూతురు. అతనెవరో కాదు మన ఉత్తేజ్.

అతని కూతురు చేతన నే.. ‘బద్రి’ సినిమాలో కనిపించిన పాప.2017 లో వచ్చిన ‘పిచ్చి గా నచ్చావ్’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది చేతన. అటు తర్వాత ‘ప్యార్’ సినిమాలో కూడా నటించింది. అంతేకాదు చేతనకు పెళ్లి కూడా అయిపోయిందట.పూరి డైరెక్టర్ కాకముందు నుండీ ఉత్తేజ్ తో ఫ్రెండ్ షిప్ ఉందట. ఆ చనువు కారణంగానే ‘బద్రి’ సినిమాలో చేతనకు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus