సిక్స్ ప్యాక్ బాడీ రప్పించడానికి హీరోలు పాటించిన ఆహార సూత్రాలు
March 8, 2017 / 02:23 PM IST
|Follow Us
కథ డిమాండ్ ని బట్టి.. కమర్షియల్ ఫార్ములాని అనుసరించి హీరోలు సిక్స్ ప్యాక్ బాడీని రప్పిస్తుంటారు. దీని వెనుక ఎంతో శ్రమ, వ్యయం ఉంటుంది. ఇష్టమైనవి పక్కన పెట్టి ఫిట్ నెస్ నిపుణులు ఇచ్చిన చిట్టా ప్రకారం ఆహారం తీసుకోవాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో శిల్పంలా బాడీని సొంతం చేసుకోవాడని హీరోలు పాటించిన డైట్స్ పై ఫోకస్..
ప్రభాస్ టాలీవుడ్ హీరోలు ఎంతమంది సిక్స్ ప్యాక్ చేసిన రాని గుర్తింపు ప్రభాస్ కి వచ్చింది. ఆ కటౌట్ కి సిక్స్ ప్యాక్ మరింత గ్లామర్ అద్దింది. బాహుబలి లుక్ కోసం ప్రభాస్ రోజులో ఆరు సార్లు భోజనం చేసేవారు. రోజుకి ప్రోటీన్ పౌడర్ కలిపిన 40 హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ వైట్స్ తిన్నారు. చేపలు, ఎండు ఫలాలు (నట్స్) ని ఎక్కువగా తీసుకొని బాడీని శిల్పంలా మలుచుకున్నారు.
మహేష్ బాబు చొక్కా విప్పని సూపర్ స్టార్ మహేష్ బాబు.. నేనొక్కడినే సినిమా కోసం సిక్స్ ప్యాక్ రప్పించారు. ఇందుకోసం మూడు నెలలు డైట్ ఫాలో అయ్యారు. రోజుకు ఏడుసార్లు ఆహారాన్ని మితంగా తీసుకునేవారు. ఓట్స్ , బ్రోకలీ , స్పినాచ్ , పాస్తా , ఫిష్, గ్రిల్ల్డ్ చికెన్ కొలతల వారీగా తిన్నారు.
రానా బాహుబలి కి ముందు .. తర్వాత రానా లుక్ లో భారీ మార్పు కనిపించింది. దాదాపు ఇరవైకిలోలు బరువు పెరిగి సిక్స్ ప్యాక్ సొంతం చేసుకున్నారు. ఇందుకోసం ఆయన విపరీతంగా తిన్నారు. ఓట్స్, బ్రౌన్ బ్రెడ్, ఎగ్ వైట్స్, నట్స్, కూరగాయలు, పుచ్చకాయ, బొప్పాయి, అరటిపండ్లు, చేపలు.. ఈ లిస్ట్ చాలానే ఉంది. కొన్ని సార్లు తిని తిని బోర్ కూడా కొట్టేయంట. కానీ భల్లాల దేవా లుక్ కోసం కస్టపడి బాడీ తో పాటు పేరు తెచ్చుకున్నారు.
నితిన్ నితిన్ విక్టరీ సినిమా కోసం తొమ్మిది నెలల్లో ఎయిట్ ప్యాక్ సాధించారు. అందుకు అతను రోజుకు 24 ఎగ్ వైట్స్, 1.5 కిలోల గ్రిల్ల్డ్ చికెన్, 3 ప్రోటీన్ షేక్స్ తీసుకునేవారు. మినరల్, విటమిన్ టాబ్లెట్స్ ఫిట్ నెస్ నిపుణుల సూచన మేరకు వేసుకునేవారు.
సూర్య ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్ ‘, ‘7th సెన్స్ సినిమాల్లో సిక్స్ ప్యాక్ తో అలరించారు. ఈ లుక్ కోసం సూర్య రెగ్యులర్ గా చేసే వ్యయంతో పాటు డైట్ పాటించారు. బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్ వైట్స్ , లంచ్ లో చికెన్ ఉండేలా చూసుకున్నారు. అలాగే లంచ్ కి డిన్నర్ కి మధ్యలో ప్రోటీన్స్ అధికంగా ఉండే స్నాక్స్ తీసుకున్నారు.
సునీల్ ఫ్యామిలీ ప్యాక్ నుంచి సిక్స్ ప్యాక్ కి మారిపోయిన నటుడు సునీల్. ఇతను పూలరంగడులో కనిపించే లుక్ కోసం రోజుకి 12 ఎగ్ వైట్స్ తో పాటు ఐస్ క్యూబ్స్ తినేవారు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకునేవారు.
నాగార్జున టాలీవుడ్ మన్మధుడు నాగార్జున బాడీ ని ఎప్పుడూ కంట్రోల్లోనే ఉంచుకుంటారు. అయన తొలిసారి డమరుకం మూవీలో సిక్స్ ప్యాక్ చూపించారు. నాగ్ కొంచెం డైట్ గట్టిగా ఫాలో అయి ఈ బాడీని సొంతం చేసుకున్నారు. ఉదయం 6 గంటలే లేచి వ్యాయామం, ఎగ్ వైట్స్ తో పాటు ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ లాగించేవారు. లంచ్ లో రోటీలు కొంచెం అన్నం తీసుకునేవారు. ఎక్కువగా పండ్లు, వెజిటేబుల్స్ తిని ఫిట్ లుక్ ని సొంతం చేసుకున్నారు.
ఆది యువ హీరో ఆది రఫ్ సినిమా కోసం రఫ్ లుక్ తీసుకొచ్చారు. బ్రౌన్ రైస్, ఎగ్ వైట్స్ , ఉడకబెట్టిన కూరగాయలు, ఫ్రూట్ సలాడ్స్ తిని సిక్స్ ప్యాక్ రప్పించారు.
అభిజీత్లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ మూవీలో ఆకట్టుకున్న అభిజీత్ భారీ యాక్షన్ సినిమా కాకపోయినా ఆసక్తితో సిక్స్ ప్యాక్ రప్పించాడు. రోజుకు ఆరు సార్లు భోజనం తింటూ, 210 గ్రాముల ప్రోటీన్స్ తీసుకుంటూ ఆకర్షణీయమైన లుక్ రాబట్టాడు.
ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని మళ్ళీ హిట్ ట్రాక్ లోకి తెచ్చిన సినిమా టెంపర్. ఇందులో తారక్ సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొట్టారు. ఇందుకోసం బ్రేక్ ఫాస్ట్ లో 15 ఎగ్ వైట్స్ తో పాటు బ్రెడ్ తినేవారు. తనకిష్టమైన నాన్ వెజ్ ఫుడ్ ని మితంగా తీసుకుంటూ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకున్నారు. రాత్రి పూట రోటీలతో సరిపెట్టారు.