హారిక హాసిని క్రియేషన్ కి త్రివిక్రమ్ కీ మంచి స్నేహం వుంది. త్రివిక్రమ్‌పై ప్రేమతోనే రాధాకృష్ణ నిర్మాతయ్యారు. జులాయి. సన్నాఫ్ సత్యమూర్తి.. అ.ఆ వీళ్ల బ్యానర్లో వచ్చాయి. అయితే ‘అ ఆ’ సినిమా విషయంలో వీరి మధ్య విబేధాలు వచ్చాయని చెప్పుకున్నారు.
త్రివిక్రమ్ తన టీమ్‌ని ఇష్టమొచ్చినట్టు మార్చేశారని, సినిమా ఆసల్యంతో పాటు బడ్జెట్ కూడా బాగా పెరిగిపోయిందని, అలాగే ఈ సినిమా ఇంటర్వ్యూలకూ త్రివిక్రమ్ రాకపోవడంతో రాధాకృష్ణ అసహనం వ్యక్తం చేశాడని అందుకే.. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని చెప్పుకున్నారు.