ఇది కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా అర్ధం కావడం లేదు
December 18, 2019 / 01:30 PM IST
|Follow Us
సచిన్ దర్శకత్వంలో ‘అడ్వెంచర్స్ ఆఫ్ శ్రీమన్నారాయణ’ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో కన్నడలో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరో రక్షిత్ శెట్టి పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఆయనకి జోడీగా శాన్వి కనిపించనుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కన్నడలో ఈ సినిమాను డిసెంబర్ 27వ తేదీన.. తెలుగులో జనవరి 1వ తేదీన.. తమిళ-మలయాళ భాషల్లో జనవరి 3వ తేదీన.. హిందీలో జనవరి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం
కుదిరితే అన్నీ భాషల్లోనూ సినిమాను ఒకేసారి విడుదల చేయాలని ప్రతిఒక్కరూ పరితపిస్తున్న ఈ తరుణంలో రక్షిత్ శెట్టి ఇలా వారానికి ఒక భాషలో విడుదల చేయనుండడం పెద్ద చర్చకు దారి తీసింది. కథపై ఎంత నమ్మకం ఉన్నా.. ఒక భాషలో విడుదలయ్యాక మిగతా భాషా ప్రేక్షకులు సదరు సినిమాని థియేటర్ లోనో, ఆన్లైన్ పైరసీలోనో చూడడం అనేది సర్వసాధారణం అయిపోయిన ఈ జనరేషన్ లో ఇలా.. దిఫరెంట్ లాంగ్వేజస్ లో డిఫరెంట్ డేట్స్ కి రిలీజ్ చేయడం అనేది మాత్రం మార్కెట్ పరంగా మంచిది కాదు. హిట్ అయినా కూడా మంచి ఎఫెక్ట్ ఇవ్వని ఈ ప్లాన్.. ఇక ఫ్లాప్ అయిన పరిస్థితి ఏమిటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.