ఒక సినిమా థియేటర్ లో విడుదలైన ఎనిమిది వారాల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ కాకూడదని నిర్మాతల మండలి ఓ నిర్ణయం తీసుకుంది. అలా నిర్ణయించిన మండలిలో దిల్ రాజు కీలక సభ్యుడు. ఇప్పుడు దిల్ రాజే ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి.. తన ‘వకీల్ సాబ్’ సినిమాను థియేటర్లో విడుదలైన మూడు వారాలకే ఓటీటీలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమా ఈ నెల 9న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఈ నెల 30న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అంటే సినిమా రిలీజైన 21 రోజులకే స్ట్రీమింగ్ కి రెడీ అవుతుందన్నమాట.
కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం తన సినిమా ఇప్పట్లో ఓటీటీలోకి రాదంటూ గతంలో చాలా హంగామా చేశారు. ఇప్పుడేమో మాట తప్పి 21 రోజులకే ఓటీటీలో తమ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమా ఇంత త్వరగా ఓటీటీలో రిలీజ్ చేయడం మంచిది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలానే గనుక కంటిన్యూ చేస్తే.. ఫ్యూచర్ లో పెద్ద హీరోలంతా తమ సినిమాలను రెండు, మూడు వారాలకే ఓటీటీకి స్ట్రీమింగ్ కి ఇచ్చేస్తారు. అలా జరిగితే జనాలకు నమ్మకం పోతుందని.. థియేటర్లకు రావడం తగ్గించేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే గనుక జరిగితే థియేట్రికల్ బిజినెస్ పై పెద్ద దెబ్బ పడడం ఖాయం.
మామూలుగా సినిమాకి హిట్ టాక్ వస్తే వారం రోజులే ఆడుతుంది. ఆ సమయంలో కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోతే డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు నష్టాలూ తప్పవు. కాబట్టి కనీసం పెద్ద సినిమాల విషయంలోనైనా రూల్స్ పాటించి.. ఎనిమిది వారాల తరువాత స్ట్రీమింగ్ కి ఇస్తే మంచిది. నిజానికి ‘వకీల్ షబ్’ సినిమాను ఆలస్యంగానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు కానీ కరోనా, ఇతర కారణాల వలన సినిమా థియేట్రికల్ రన్ ముందే ముగిసిపోయింది. ఓటీటీ రిలీజ్ ఎక్కువ రోజులు ఆపి ప్రయోజనం లేదని.. ఇలా ముందుగానే ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!