నాగచైతన్య – విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘థాంక్యూ’ చిత్రం జూలై 22న విడుదల కాబోతుంది. సుమారు 12 ఏళ్ళ గ్యాప్ తర్వాత నిర్మాత దిల్ రాజు… నాగ చైతన్యతో రూపొందించిన మూవీ ఇది. వీరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ‘థాంక్యూ’ మూవీ తో దిల్ రాజు కచ్చితంగా చైతన్యకి ఓ హిట్ ఇస్తారు అని అంతా అనుకుంటున్నారు.ప్రమోషన్లు కూడా బాగానే చేశారు. టీజర్, ట్రైలర్ వంటివి బాగానే ఉన్నాయి.
కానీ కలవరపెట్టే అంశం ఒక్కటే. ఇటీవల కాలంలో థియేటర్లకు జనాలు రావడం లేదు.ఒకవేళ వచ్చినా.. వీకెండ్ వరకే వస్తున్నారు. సోమవారం నుండి థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచకుండా దిల్ రాజు ‘ఎఫ్3’ మూవీని రిలీజ్ చేశారు. రిజల్ట్ పర్వాలేదు అనిపించింది. ఈసారి ఇంకో అడుగు ముందుకేసి.. తన ‘థాంక్యూ’ చిత్రానికి టికెట్ రేట్లు తగ్గిస్తున్నట్లు ఇటీవల ప్రమోషన్లలో చెప్పుకొచ్చారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు అన్నది నెటిజెన్ల గొడవ.
‘థాంక్యూ’ ప్రమోషన్లో భాగంగా టికెట్ ధర తెలంగాణలోని… సింగిల్ స్క్రీన్లలో 100 రూపాయలు+ జీఎస్టీ, మల్టీప్లెక్స్ లలో 150 రూపాయలు + జీఎస్టీ గా ఉంటుందని దిల్ రాజు ప్రకటించారు.దీంతో సాధారణ ప్రేక్షకులకు కూడా సినిమా అందుబాటులో ఉంటుంది అని దిల్ రాజు చెప్పారు. అయితే ఈరోజు బుక్కింగ్స్ ప్రారంభమవ్వగా… అందులో దిల్ రాజు చెప్పిన తక్కువ రేట్లు లేవు.
తెలంగాణాలో.. ముఖ్యంగా హైదరాబాద్ లో సింగిల్ సీన్స్ లో ‘థాంక్యూ’ టికెట్ ధర ₹175 , మల్టీప్లెక్స్ లలో ₹250 వరకు ఉన్నాయి! దీంతో ఫేక్ మాటలు చెప్పి దిల్ రాజు తన సినిమాని పబ్లిసిటీ చేసుకున్నారు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇవే టికెట్ రేట్లతో ఉంటే కనుక ‘థాంక్యూ’ అడ్వాన్స్ బుకింగ్స్ పై ఎఫెక్ట్ పడడం ఖాయమనే చెప్పాలి. మరి దీనిపై ఆయన(దిల్ రాజు) ఎలా స్పందిస్తారు అన్నది తెలియాల్సి ఉంది.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!