BVS Ravi :’జవాన్’ ప్లాప్ అవ్వడానికి కారణం దిల్ రాజే.. ఎలా అంటే
January 28, 2023 / 09:45 AM IST
|Follow Us
బీవీఎస్ రవి… చాలా కాలంగా టాలీవుడ్లో ఉన్న రచయిత. చాలా బిజీగా ఉండే రచయిత. ఇతని స్నేహితులు అలాగే తోటి రచయితలు అయిన త్రివిక్రమ్, కొరటాల శివ, హరీష్ శంకర్ వంటి వారు స్టార్ డైరెక్టర్లు అయిపోతే ఇతను మాత్రం ఇంకా రచయితగానే మిగిలిపోయాడు. అలా అని ఇతను ఖాళీగా ఉన్న రైటర్ కాదు. ఉదయం 6 గంటల నుండి నైట్ 8 గంటల వరకు స్క్రిప్ట్ రైటింగ్లో బిజీగానే ఉంటాడు. దర్శకుడిగా కూడా రెండు సినిమాలు చేశాడు.
అవే ‘వాంటెడ్’ ‘జవాన్’. ఇవి రెండు క్రేజీ ప్రాజెక్టులే. గోపిచంద్ స్టార్ గా రాణిస్తున్న రోజుల్లో ‘వాంటెడ్’ తీశాడు. మొదటి సినిమా కాబట్టి.. టేకింగ్ విషయంలో తడబడ్డాడు అని అతనే ఒప్పుకున్నాడు. అయితే కొంత గ్యాప్ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో ‘జవాన్’ అనే సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు. ‘అరుణాచల క్రియేషన్స్’ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కథనం చాలా వరకు రాంచరణ్ ‘ధృవ’ కి దగ్గరగా ఉంటుంది.
నిజానికి ‘ధృవ’… ‘తని ఒరువన్’ అనే తమిళ సినిమాకి రీమేక్. అయితే విచిత్రంగా ‘జవాన్’ కథని 2015 లోనే రాసుకున్నాడట బీవీఎస్ రవి. కానీ ఆ తర్వాత అలాంటి కథతోనే ‘తని ఒరువన్’ వచ్చింది. ఆ సినిమాని సురేందర్ రెడ్డి.. రాంచరణ్ తో రీమేక్ చేస్తున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. దీంతో చరణ్ సినిమాకి నా సినిమా వల్ల ఇబ్బంది కలగకూడదు.. అలాగే తమిళ సినిమాని కాపీ కొట్టినట్టు ఉండకూడదు అని సాయి తేజ్ ‘ధృవ’ రిలీజ్ అయ్యాక ఈ ప్రాజెక్టుని సెట్స్ పైకి తీసుకెళ్లాడట.
అంతా బాగానే ఉంది కదా అనుకున్న టైంలో దిల్ రాజు ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పకులుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆయన రిలీజ్ చేసే సినిమాకి ఎడిటింగ్ లు ఏ రేంజ్లో చేయిస్తాడో తెలిసిందేగా. ‘జవాన్’ విషయంలో కూడా అదే జరిగిందట. దీంతో రవి అనుకున్నట్టు సినిమా రాలేదు. దిల్ రాజు కెలకడం వలనే ఆ సినిమా పోయింది అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్ట్ గానే చెప్పేశాడు రవి.