Dil Raju: వారసుడు వివాదంపై స్పందించి క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!
November 29, 2022 / 12:11 AM IST
|Follow Us
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి మంచి గుర్తింపు పొందారు. ఇకపోతే ఈయన తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న వరిసు సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని తమిళంలో నిర్మించి తెలుగులో వారసుడు పేరుతో డబ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాని తెలుగులో కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నడంతో ఈ సినిమా చుట్టూ వివాదాలు నెలకొన్నాయి.
సంక్రాంతి బరిలో సినిమాలు వస్తున్నాయంటే ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు సినిమాలకు ప్రియారిటి ఇచ్చిన తరువాతే డబ్ సినిమాలను విడుదల చేయాలి.అయితే దిల్ రాజు సినిమా కోసం ఇక్కడ థియేటర్లు ఇవ్వడం కుదరదు అంటూ నిర్మాత మండలి తెలియజేయడంతో పెద్ద ఎత్తున వివాదం ఏర్పడింది. ఈ విషయంపై ఎంతో మంది నిర్మాతలు మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు. తాజాగా ఈ విషయంపై నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.
సంక్రాంతికి సినిమాలు అంటే పెద్ద ఎత్తున పోటీ పడుతుంటాయి. కనుక దాదాపు మూడు నెలల ముందు నుంచి థియేటర్లను బుక్ చేసుకుంటారు. ఇక ఈ సంక్రాంతి కానుకగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం నుంచి బాలకృష్ణ చిరంజీవి నటించిన సినిమాలు సంక్రాంతికి విడుదల కావడం విశేషం. అలాగే ప్రభాస్ ఆది పురుష్ సినిమా విడుదల కాబోతుందని ప్రకటించారు. ఇకపోతే ఈ రేసు నుంచి ప్రభాస్ సినిమా తప్పుకోవడంతో మైత్రి మూవీ మేకర్స్ నుంచి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో పాటు మా వారసుడు సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక వారసుడు సినిమాని మేము మే నెలలోనే ప్రకటించాము ఇక మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఈ రెండు సినిమాలు జూలై నెలలో ప్రకటించారు. ఇకపోతే బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా డిసెంబర్లోనే విడుదల చేయాల్సిందిగా కొన్ని కారణాలవల్ల సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో మైత్రి మూవీ మేకర్స్ నుంచి బాలకృష్ణ చిరంజీవి సినిమాలు విడుదలవుతున్నాయి వీటితో పాటు వారసుడు సినిమా కూడా విడుదల కాబోతుంది.
ఇలా ఈ మూడు సినిమాలు విడుదలైనప్పటికీ ఈ సినిమాలకు కావాల్సినన్ని థియేటర్లు పుష్కలంగా ఉన్నాయని దిల్ రాజు పేర్కొన్నారు.ఇకపోతే గతంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఎన్నో సినిమాలకు తాను డిస్ట్రిబ్యూటర్ గా చేశానని, మాకు మైత్రి మూవీ మేకర్స్ తో ఏ విధమైనటువంటి సమస్యలు లేవని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక మహా సముద్రం లాంటిది ఇక్కడ ఎవరి బిజినెస్ లు వారివేనని ఈ సందర్భంగా వారుసుడు వివాదం గురించి ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.