Dil Raju: ప్రేక్షకులను థియేటర్లకి రాకుండా చెడగొట్టింది మేమే : దిల్ రాజు
August 17, 2024 / 10:26 PM IST
|Follow Us
‘రేవు’ అనే చిన్న సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి దిల్ రాజు (Dil Raju) గెస్ట్ గా వెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “కొత్త వాళ్లతో సినిమాలు చేస్తూ చాలా మంది ప్రయోగాలు చేస్తారు. కానీ అందులో ఒక్క శాతం మాత్రమే సక్సెస్ సాధిస్తారు.. 99 శాతం ఫెయిల్ అవుతారు. ఈరోజుల్లో సినిమా తీయడం గొప్ప కాదు. ప్రేక్షకులను థియేటర్ వరకు తీసుకురావడం గొప్ప. వాస్తవానికి ప్రేక్షకులను థియేటర్లకి రాకుండా మేమే చేశాం లెండి.
Dil Raju
మీరు ఇంట్లోనే కూర్చోండి 4 వారాల్లో మేమే సినిమాని మీ ముందుకు తెస్తామని చెప్పి.. వాళ్ళను చెడగొట్టాం. అయితే ‘బలగం’ (Balagam) ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu) వంటి సినిమాలు మౌత్ టాక్ తో జనాలను ఆకట్టుకుని సక్సెస్ సాధించాయి. ఈ ‘రేవు’ కూడా అలానే సక్సెస్ సాదించాలి” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దిల్ రాజు చెప్పిందాంట్లో పూర్తిగా వాస్తవం ఉంది అని చెప్పలేం. ఎందుకంటే 4 వారాల్లో ఓటీటీల్లోకి సినిమా వచ్చేస్తుంది అంటే.. ఆగిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు.
‘మురారి’ (Murari) వంటి సినిమా యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంది. అయినప్పటికీ.. దానిని రీ రిలీజ్ చేస్తే రూ.8 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ప్రతి చోటా హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. కంటెంట్ ఉంటే జనాలు కచ్చితంగా థియేటర్లకు వస్తారు. ఓటీటీలో 4,5 వారాలకి ప్రతి సినిమా వచ్చేస్తుందని వాళ్ళకి తెలుసు. అయినా సరే వాళ్ళు థియేటర్లకు రావడం మానేయడం లేదు.
ఎటొచ్చీ ఫిలిం మేకర్స్ ఆలోచించాల్సింది మంచి కంటెంట్ గురించి. సినిమాలో మంచి కంటెంట్ లేకపోతే ఎంత హడావిడి చేసినా జనాలు థియేటర్లకు రారు.ఎన్ని మేనేజ్ చేసినా మౌత్ టాక్ ను బట్టే.. జనాలు థియేటర్ కి వస్తారు. ఇది దిల్ రాజు వంటి పెద్దలు మర్చిపోకూడదు.