Dil Raju: వచ్చే సంక్రాంతికి టాలీవుడ్‌ vs కోలీవుడ్‌!

  • May 9, 2022 / 05:57 PM IST

తెలుగు సినిమాలకు సంక్రాంతి సెంటిమెంట్ ఎంత ఎక్కువ మీకు తెలిసిందే. సినిమా సీజన్‌లలో సంక్రాంతిని రారాజు అని చెప్పొచ్చు. అలాంటి సంక్రాంతికి దిల్‌ రాజు సినిమా ఒకటి ఉండటం గత కొన్నేళ్లుగా కచ్చితంగా జరుగుతూ వస్తోంది. ఏదో ఒక సినిమాను ఆ టైమ్‌కి సిద్ధం చేస్తూ ఉంటారు దిల్‌ రాజు. అలా వచ్చే సంక్రాంతికి ఏ సినిమా తీసుకొస్తారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన ప్రొడక్షన్‌లో 50వ సినిమాగా రూపొందుతున్న శంకర్‌– రామ్‌చరణ్‌ సినిమా అవ్వొచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ లెక్క మారింది.

అవును, వచ్చే సంక్రాంతికి దిల్‌ రాజు వేరే ప్లాన్స్‌లో ఉన్నారు. తొలిసారిగా తమిళంలో ఆయన నిర్మిస్తున్న #విజయ్‌66 (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్‌ ఎంపిక పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో సీనియర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లను ఎంపిక చేసి ఆ వివరాలు వెల్లడించారు. వాటితోపాటుగా సినిమా విడుదల తేదీ కూడా చెప్పేశారు. అదే వచ్చే సంక్రాంతి అని.

దీంతో మరి రామ్‌చరణ్‌ సినిమా సంగతి ఏంటి అనేది ప్రశ్నగా మారిపోయింది. నిజానికి ఈ సినిమానే తొలుత సంక్రాంతికి తీసుకొద్దామని అనుకున్నారట దిల్‌ రాజు. అయితే వివిధ కారణాల వల్ల సినిమా చిత్రీకరణకు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని భావించారట. దీంతో విజయ్‌ – వంశీ పైడిపల్లి సినిమానే తెచ్చేద్దామని చూస్తున్నారని అంటున్నారు. విజయ్‌ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తైంది. మరో సుదీర్ఘ షెడ్యూల్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

దీంతో వచ్చ సంక్రాంతి టాలీవుడ్‌ వర్సెస్‌ కోలీవుడ్‌ అవ్వనుందని సమాచారం. టాలీవుడ్‌ నుండి వచ్చే ఏడాది కనీసం రెండు సినిమాలుంటాయని అంటున్నారు. తారక్‌ – కొరటాల శివ సినిమా సంక్రాంతికి వస్తుందంటున్నారు. అలాగే పవన్‌ కల్యాణ్‌ సినిమా కూడా ఆ సమయానికి విడుదల చేయాలని చూస్తున్నారు. దీంతో కోలీవుడ్‌తో టాలీవుడ్‌ వార్‌ ఉంటుంది. అదేంటి విజయ్ సినిమా రెండు భాషల సినిమా కదా అంటారా. ఏమో మరి విజయ్‌ అయితే ఆ మధ్య తమిళంలో తీసి తెలుగులోకి డబ్బింగ్‌ చేస్తున్నాం అని చెప్పాడు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus