‘డీజె’ ఫార్ములానే ‘మహర్షి’ కి యూజ్ చేస్తున్న.. దిల్ రాజు?
May 16, 2019 / 04:58 PM IST
|Follow Us
సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాకి డిజాస్టర్ టాక్ వస్తే.. ఆ చిత్రం జోలికి ఇక పోడు. కానీ మిక్సిడ్ టాక్ వచ్చిందంటే.. ఏదో ఒక రకంగా ఆ చిత్రాన్ని ఆడించడానికి తెగ ప్రమోషన్లు చేస్తుంటాడు. గతంలో దిల్ రాజు.. అల్లు అర్జున్,హరీష్ శంకర్ లతో నిర్మించిన ‘దువ్వాడ జగన్నాథం – డీజె’ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసాడు. ఈ చిత్రాన్ని జూన్ 23 2016 న అదీ రంజాన్ హాలిడే ఉండడంతో భారీ స్థాయిలో విడుదల చేసాడు. ఈ చిత్రానికి మిక్సిడ్ టాక్ వచ్చింది. రివ్యూస్ కూడా పూర్ గా వచ్చాయి. అయితే భారీ స్థాయిలో విడుదల చేయడం… వరుసగా సెలవులు రావడం.. పోటీగా మరే చిత్రం లేకపోవడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
ఆ చిత్రం థియేటర్లలో ఉన్నన్ని రోజులు సక్సెస్ మీట్లంటూ తెగ ప్రమోషన్లు చేసాడు. కానీ చివరికి ఆ చిత్రం బ్రేక్ ఈవెన్ కాలేదు, దీంతో ముందు రాజు గారు చేసిన హడావిడి అంతా ఫేక్ అని తేలిపోయింది. దీంతో దిల్ రాజు సైడయిపోయాడు. తరువాత ‘ఫిదా’ సినిమా టైములో బయటపడ్డాడు. ‘దువ్వాడ జగన్నాథం – డీజె’ చిత్రానికి వచ్చిన నష్టాల్ని ‘ఫిదా’ చిత్రంతో తీర్చేసానని దిల్ రాజు ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు మహేష్ 25 వ చిత్రమైన ‘మహర్షి’ చిత్రం విషయంలో కూడా ఇదే ఫార్ములా యూజ్ చేస్తున్నాడు దిల్ రాజు. ఈ సినిమా విడుదలయ్యి డీసెంట్ టాక్ ను అయితే తెచ్చుకుంది. ఇప్పుడు కూడా పోటీ సినిమా లేదు కాబట్టి భారీ స్థాయిలో.. అది కూడా టికెట్ రేట్లు పెంచి మరీ విడుదల చేసాడు. ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. మహేష్ కెరీర్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఓవర్సీస్, సీడెడ్ వంటి ఏరియాల్లో ఈ చిత్రానికి భారీ నష్టాలూ తప్పేలా లేవు. మరి చివరికి ఈ చిత్రం కూడా ‘దువ్వాడ జగన్నాథం – డీజె’ లానే చివరికి యావరేజ్ గా నిలుస్తుందేమో. పాపం ఈ విషయం మహేష్ కు అర్థం కాక తెగ కాలర్ ఎగరేస్తున్నాడు. ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ కూడా నిరుత్సాహానికి గురవుతున్నారు. మహేష్ కు హిట్ చిత్రాలు చాలామందికి హాట్ ఫేవరెట్. నిజానికి చాలా గొప్ప చిత్రాలనే అందించాడు మహేష్. డిజాస్టర్లు ఉన్నా వాటికి కూడా ఓ గౌరవం ఉంటుంది అనడంలో సందేహం లేదు. ‘మహర్షి’ రికార్డులతో పోల్చి వాటి స్థాయిని తగ్గించేస్తున్నాడు. ఒక విధంగా చూస్తే.. కంటెంట్ వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది’ అని మహేష్ ‘ఆగడు’ చిత్రంలో డైలాగ్ ‘మహర్షి’ ప్రమోషన్లకు కరెక్ట్ గా సరిపోతుంది. ‘ఇప్పటికైనా మేల్కొని తన 26 వ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొడితే బెటర్’ అని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.