పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే.. అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవవసరం లేదు. టాక్ తో సంబంధం లేకుండా అతని సినిమాలకు భారీ ఓపెనింగ్స్ నమోదవుతూ ఉంటాయి. ‘పవన్ అలా నడిచొస్తే చాలు రికార్డులే రికార్డులు’ అంటూ అభిమానులు కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి కూడా ఇదే ప్రధాన కారణం. అయితే సినిమాకి మంచి టాక్ రాకపోతే పవన్ కళ్యాణ్.. సినిమాలో నడిచినా.. ఎగిరి గంతులేసినా ఉపయోగం ఉండదు. అయితే ‘ఓపెనింగ్స్ వస్తున్నాయి కదా.. ఇంకేముంది కలెక్షన్లు అట్టే వచ్చేస్తాయి’ అని చాలా మంది అనుకుంటారు.
నిజానికి నిర్మాతలు, బయ్యర్లు కూడా అదే ఫీలవుతూ ఉంటారు. అందుకే కోట్లకు కోట్లు పెట్టి సినిమాని క్యాష్ చేసుకుంటూ ఉంటారు. ‘అజ్ఞాతవాసి’ సంగతే చూసుకుంటే.. ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ ను భారీగా రూ.126కోట్లకు అమ్మారు. అయితే 60కోట్ల షేర్ ను అంటే సగానికి సగం కూడా ఆ చిత్రం రాబట్టలేకపోయింది. మొదటిరోజే రూ.39కోట్ల షేర్ ను రాబట్టిన ఆ చిత్రం తరువాత రోజుల్లో ఆ జోరుని చూపించలేకపోయింది.ఫలితంగా డబుల్ డిజాస్టర్ అనే ముద్ర పడింది.
అంతకు ముందు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘కాటమరాయుడు’ సినిమాల పరిస్థితి కూడా అంతే..! కాబట్టి.. ఈసారి ‘వకీల్ సాబ్’ చిత్రం విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అయితే.. పవన్ కు మంచి రీ ఎంట్రీ దొరికినట్టు కాదు. కాబట్టి.. ‘వకీల్ సాబ్’ బడ్జెట్ ను అదుపులో పెట్టినట్టే.. బిజినెస్ ను కూడా దిల్ రాజు పద్దతిగా అదుపులో పెడితే.. అలాంటి ప్రమాదం నుండీ ‘వకీల్ సాబ్’ తప్పించుకుని సూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఉంటుంది.
Most Recommended Video
వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!