Dil Raju: సునీత భర్తతో కలిసి ఓటీటీ సంస్థని స్థాపిస్తున్న దిల్ రాజు

  • November 2, 2023 / 09:06 PM IST

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన డిస్ట్రిబ్యూటర్ కూడా..! ఆయన సినిమాలు మాత్రమే కాకుండా.. వేరే సినిమాలు కూడా చూసి, అవి కూడా వర్కౌట్ అవుతాయి అనుకుంటే.. హక్కులు కొనుగోలు చేసి రిలీజ్ చేస్తుంటారు దిల్ రాజు. ఈ మధ్య చిన్న బ్యానర్ కూడా స్టార్ట్ చేసి 4 ,5 కోట్ల బడ్జెట్లో ఫినిష్ అయ్యే సినిమాలు నిర్మించాలని భావిస్తున్నారు దిల్ రాజు.

‘బలగం’ సినిమా కూడా అందులో భాగంగా తీసిందే. అయితే దానిని థియేటర్స్ లో రిలీజ్ చేయగా.. ఊహించని విధంగా అది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. పెట్టిన రూపాయికి 10 రెట్లు లాభాలు అందించింది. ఇదిలా ఉండగా.. దిల్ క్యాంప్ లో ఇప్పుడు 50 కి పైగా కథలు ఉన్నాయి. అన్నీ సినిమాలుగా రూపొందించి రిలీజ్ చేయడం కష్టం. అందుకే సొంతంగా ఓటీటీ సంస్థని స్థాపించి.. దాని కోసం కూడా సినిమాలు రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

సునీత భర్త.. రామ్ వీరపనేనితో కలిసి (Dil Raju) దిల్ రాజు ఓటీటీ కోసం సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు స్టార్ట్ చేసే ఓటీటీ కూడా రామ్ వీరపనేని సాయంతోనే స్టార్ట్ చేస్తున్నారు అని సమాచారం. ఈ మధ్య కాలంలో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకి బిజినెస్ పెద్దగా జరగడం లేదు. ఆహా వారు కూడా అడ్వాన్స్ మాత్రమే ఇచ్చి వ్యూయర్ షిప్ బేస్ పై తీసుకుంటున్నాయి. అందుకే తన సినిమాల కోసం దిల్ రాజు కూడా ఈ బిజినెస్ లోకి దిగినట్టు సమాచారం.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus