Dimple Hayathi: ఆడవాళ్లంటే అంత చులకనా?.. డింపుల్ హయతి షాకింగ్ కామెంట్స్..!
November 1, 2022 / 06:25 PM IST
|Follow Us
ఆన్ స్క్రీన్ గళగళా డైలాగులు చెప్పినా.. ఒక్క చిన్న చిరునవ్వు నవ్వినా.. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నా కానీ కథానాయికని ఇష్టపడుతుంటాడు హీరో.. ఆమె తన ప్రేమను కాదంటే దేవదాసు అయిపోతాడు.. ప్రేమించే వరకు వెంటపడి విసిగిస్తాడు.. అతనిదే జెన్యూన్ లవ్.. తప్పంతా అమ్మాయిదే అన్నట్టు చూపిస్తుంటారు.. ఈ పద్ధతి మారాలి అంటుంది బ్యూటిఫుల్ యాక్ట్రెస్ డింపుల్ హయతి.. ఇప్పటివరకు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన హీరోయిన్లను, నటీమణులను చాలా మందిని చూశాం కానీ..
ఇలా సినిమాల్లో మహిళల క్యారెక్టర్ల గురించి, వాళ్లు చేస్తున్న పాత్రలకు ప్రాధాన్యతనివ్వట్లేదని బహిరంగంగా చెప్పిన వాళ్ల మాత్రం చాలా తక్కువ.. తెరపై ఆడవాళ్లను చూపిస్తున్న విధానం మారాలి అంటూ ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..ఇక సినిమాల్లో వుమెన్ క్యారెక్టర్ల గురించి డింపుల్ మాట్లాడుతూ.. ‘‘ఆడవాళ్ల విషయంలో సొసైటీ మాదిరిగానే సినిమాల్లో కూడా వివక్ష ఉంది.. ప్రపంచమంతా స్త్రీలు, పురుషుల చుట్టూనే తిరుగుతోంది. మహిళల పాత్రలు సమాజంలో ఉన్నట్లే, సినిమాల్లోనూ ప్రభావితం చేస్తుంటాయి.
అందుకే అమ్మాయిల కోసం మగాళ్లు పడే పాట్లను సహజంగా చూపిస్తుంటారు. ఈ విషయంలో దర్శకనిర్మాతల పద్ధతి మారాలి.. వాళ్లు ఆలోచించే విధానంలో మార్పు రావాలి.. మూవీస్లో ఎక్కువగా మగాళ్ల ప్రేమను హైలెట్ చేస్తూ.. మహిళల పాత్రలను బలంగా రాయట్లేదు.. ముఖ్యంగా ప్రేమను చూపించడంలో ఆడాళ్ళు తక్కువ కాదని చూపించాలి. అలాంటి స్ట్రాంగ్ రోల్స్ సినిమాల్లో కనిపించడం లేదు. అలాగే రియల్ లైఫ్లో ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ని కూడా తెరపై చూపించట్లేదు.
మహిళల పాత్రలలో నేచురాలిటీని, ప్రేమను మరింత వినూత్నంగా, ఆకట్టుకునే విధంగా చూపించే కథలను దర్శకులు, నిర్మాతలు ప్రోత్సహిస్తే బాగుంటుంది”.. అని చెప్పుకొచ్చింది.. ‘‘ఏదేమైనా తను కూడా నటే.. తన మనసులో మాటని ధైర్యంగా బయటకు చెప్పినందుకు ఆమెను అభినందించాలి.. డింపుల్లా మిగతా హీరోయిన్లకి ఇలానే అనిపిస్తుంది కానీ వాళ్లెవరూ పైకి చెప్పలేదు.. నిజంగా హయతి ధైర్యాన్ని మెచ్చుకోవాలి’’.. అంటూ నెటిజన్లు ఈ నటికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు..