“తెలుగు కుటుంబంలో పుట్టినప్పటికీ అంజలిని తమిళవాసులు తమ అమ్మాయిగా చూసుకుంటున్నారు. ఇక్కడ ఆమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి విజయాలు అందుకున్నప్పటికీ.. ఆమెను దర్శకనిర్మాతలు పట్టించుకోవడం లేదు. కోలీవుడ్ లోనే అంజలికి ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పుడు ఆమె కన్బదు పోయ్, నాదోడిగల్ 2 , తొలి స్టీరియో స్కోపిక్ త్రీ డీ సినిమా “లీసా” ల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఎవరూ ఊహించిన సంఘటన జరిగింది. “లీసా” అనే సినిమాలో ఓ యాక్షన్ సన్నివేశంలో భాగంగా అంజలి తన చేతిలో ఉన్న దోసె పెనంను కెమెరా ముందుకు విసిరేయాలి.
“డైరెక్టర్ చెప్పినట్టుగానే అంజలి చేసింది. అయితే, పొరపాటున ఆ పెనం కెమెరా పక్కనే ఉన్న డైరక్టర్ మొహం మీద పడింది. ఈ ఘటనతో అంజలితో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ షాక్ తిన్నారు. పెనాన్ని వేగంగా విసరడంతో దర్శకుడి కనుబొమల మధ్య చిట్లి, తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లి, కుట్లు వేయించారు. ఈ పొరపాటు వల్ల అంజలి తెగ బాధపడిపోయింది. దర్శకుడు రాజు విశ్వనాథ్ కి క్షమాపణలు చెప్పింది. అయితే దర్శకుడే అంజలిని బాధపడొద్దని దైర్యం చెప్పడంతో ఆమె ఊపిరిపీల్చుకుంది. యూనిట్ సభ్యులు కూడా షూటింగ్ లో ఇవన్నీ సహజమని సముదాయించారు. ఇక అంజలి ఇందులో దెయ్యం రోల్ చేస్తోంది. ఏకకాలంలో తమిళం, మళయాలంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగులో అనువాదమై రిలీజ్ కానుంది.