నయనతార పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్ చేసిన డైరక్టర్

  • October 15, 2018 / 10:36 AM IST

అందాల తార నయనతార దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు స్టార్ హీరోల పక్కన నటిస్తూ విజయాలను అందుకుంటోంది. ప్రొఫిషనల్ లైఫ్ ఆమెకి ఆనందాన్ని కలిగించినా.. పర్సనల్ లైఫ్ మాత్రం కొన్ని కన్నీటి చుక్కలను బహుమతిగా ఇస్తోంది. ప్రేమలో రెండు సార్లు విఫలమై.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. శింబు, ప్రభుదేవాలతో ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా వెళ్లి ఆగిపోయింది. అందుకు గల కారణాన్ని దర్శకుడు జీటీ నందు తాజాగా వెల్లడించారు. “నేను, శింబు, మరో వ్యక్తి.. పేరొందిన జ్యోతిష్కుడిని కలిశాము. శింబు, నయనల జాతకాలను సదరు జ్యోతిష్కుడు పరిశీలించారు.

నయనతారకు వివాహం అయితే ఆమె నడి రోడ్డున పడే అవకాశం ఉంది.. పెళ్లి చేసుకోకపోతే ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని జ్యోతిష్కుడు చెప్పారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకునే శింబు నయంతో పెళ్ళికి నో చెప్పి ఉంటారు” అని వెల్లడించారు. ఇందులో వాస్తవం లేకపోలేదని కొంతమంది జీటీ నందు మాటలని నమ్ముతున్నారు. మరికొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు. శింబు వైపు తప్పులేదని చెప్పడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నయనతార పెళ్లి లేకుండా అలాగే ఉండిపోవాలా? అని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై నయనతార ఎలా స్పందిస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus