తనపై ఎన్టీఆర్ గురించి వచ్చిన రూమర్లను ఖండించిన డైరక్టర్ హరి

  • December 1, 2016 / 09:42 AM IST

తమిళ సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరక్టర్ హరి. ఆయన తీసిన సినిమాలన్నీ తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని సాధించాయి. సూర్య తో వస్తున్న సింగం సిరీస్ తో మంచి పేరు సంపాదించారు. ఇప్పుడు సింగం 3 తో త్వరలో ముందుకురానున్నారు. ఈ డైరక్టర్ పై కొన్ని రోజులుగా ఓ వార్త చాలా స్పీడ్ గా  ప్రచారమవుతోంది. ఓ ఇంటర్వ్యూ లో హరి తనకి జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని చెప్పిన్నట్లు ఆ వార్త సారాంశం.

ఇదే విషయాన్నీ ఓ తెలుగు దినపత్రిక  హరి ని అడిగింది. మీరు ఎన్టీఆర్ తెలియదని చెప్పారా? అని అడగగా అందుకు ఆయన ఆశ్చర్యపోయారు. అనంతరం మాట్లాడుతూ “ఆ వార్త పూర్తిగా అబద్ధం. ఆలా ఎందుకు ప్రచారం అవుతుందో నాకు తెలియదు. నేను ఎప్పుడూ అలా అనలేదు. ఎన్టీఆర్ నా అభిమాన నటుడు. ఆయన నటించిన టెంపర్ చిత్రాన్ని రెండు సార్లు చూశాను. తారక్ తో సినిమా చెయ్యాలని ఆయన్ని నాలుగైదు సార్లు కలిశాను. కథ కూడా చెప్పాను. అయితే అది సెట్ కాలేదు.” అని వివరించారు. దీంతో ఈ వివాదం ఇంతటితో ముగిసింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus