నితిన్ నాకు సోదరుడి లాంటి వ్యక్తి : హర్షవర్ధన్

  • March 8, 2021 / 12:30 PM IST

యంగ్ హీరో నితిన్ వరుసగా సినిమాల్లో నటిస్తూ కెరీర్ లో ఎప్పుడూ లేనంత బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా నటించిన చెక్ సినిమా గత నెలలో విడుదలై ఫ్లాప్ గా నిలిచింది. క్లైమాక్స్ లో మార్పులు చేసి ఉంటే ఈ సినిమా ఫలితం మరో విధంగా ఉండేదని నితిన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రముఖ నటుడు , రచయిత, దర్శకుడు హర్షవర్ధన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నితిన్ గతంలో నటించిన సినిమాల్లో ఒక సినిమా ఫ్లాప్ అవుతుందని నితిన్ కు ముందే తెలుసని చెప్పారు.

సై సినిమా తరువాత సరైన సక్సెస్ లేని నితిన్ కు ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలు సక్సెస్ కావడంతో పాటు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. గుండెజారి గల్లంతయ్యిందే సినిమా తరువాత షూటింగ్ దశలోనే సినిమా ఫ్లాప్ అవుతుందని నితిన్ కు అనిపించిందని.. ఆ సినిమాలో ఏవైనా మార్పులు చేద్దామని చెప్పగా తాను కొన్ని మార్పులు సూచించానని.. ఆ మార్పులు నితిన్ కు కూడా నచ్చాయని హర్షవర్ధన్ అన్నారు.

అయితే తాను చెప్పిన మార్పులు దర్శకుడికి మాత్రం నచ్చలేదని చివరకు ఆ సినిమా ఫ్లాప్ అయిందని హర్షవర్ధన్ తెలిపారు. ఇష్క్ మూవీలో కొన్ని సీన్స్ కోసం తాను రైటర్ గా పని చేశానని.. ఆ సినిమాలో పనితీరు నచ్చడంతో భవిష్యత్తు సినిమాల్లో అవకాశం ఇస్తామని నితిన్, విక్రమ్ కె కుమార్ చెప్పారని.. నితిన్ గుండెజారి గల్లంతయ్యిందే సినిమాకు ఛాన్స్ ఇస్తే విక్రమ్ కె కుమార్ మనం మూవీకి పని చేసే ఛాన్స్ ఇచ్చారని హర్షవర్ధన్ అన్నారు.

నితిన్ తనకు సోదరుడి లాంటి వ్యక్తి అని.. నిజాయితీతో ఉన్న మనిషి అని హర్షవర్ధన్ చెప్పారు. క్రియేటివ్ అంశాల విషయంలో, కథ విషయంలో నితిన్ బాగా ఆలోచిస్తాడని హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఆ సినిమా ఫ్లాప్ తరువాత కథ, టెక్నికల్ అంశాలు నచ్చితేనే సినిమా ఓకే చేయాలని నితిన్ నిర్ణయం తీసుకున్నాడని హర్షవర్ధన్ తెలిపారు.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus