సినిమా హిట్ అవ్వలేదని హిమాలయాలకు వెళ్లిపోయాడు

  • October 31, 2018 / 11:32 AM IST

ఏ డైరెక్టర్ అయినా సినిమా తీసేటప్పుడు హిట్ సినిమా తీద్దామనే ఆలోచనతోనే తీస్తాడు. సినిమా హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా అనేది కంటెంట్ & సినిమాను జనాలు రిసీవ్ చేసుకొన్నారు అనేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే.. ఆడియన్స్ సినిమా ఎలా రిసీవ్ చేసుకోవాలి అనే విషయం మీద దర్శకుడికి అంచనాలు ఉండాలి కానీ, ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది డిసైడ్ చేయకూడదు. కానీ.. యువ దర్శకుడు ఇంద్రసేన మాత్రం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే “కల్ట్ ఈజ్ రైజింగ్” అంటూ ప్రమోషన్స్ మొదలెట్టాడమే కాక.. సినిమా రిలీజ్ కి ముందు నుంచీ కల్ట్ సినిమా అని బీరాలుపోయాడు.

కట్ చేస్తే.. విడుదలకు రెండ్రోజుల ముందు ఓవర్సీస్ లో రిలీజ్ చేయగా అక్కడే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా రాలేదు. దాంతో డిజాస్టర్ గా డిక్లేర్ చేయబడింది “వీరభోగ వసంత రాయులు” చిత్రం. దాంతో.. ఆ పరాజయాన్ని తీసుకోలేకపోయిన డైరెక్టర్ ఇంద్రసేన రివ్యూ రైటర్లపై దారుణంగా మండిపడ్డాడు. అదే సందర్భంలో నా సినిమా చూడడం జనాలకి ఇంకా రాలేదని, ఇంకో 20-30 ఏళ్ళు పడుతుందని చెప్పడమే కాక ట్విట్టర్ లో తిక్కతిక్కగా సమాధానాలు చెప్పడం మొదలెట్టాడు. చివరికి.. తాను త్వరలోనే హిమాలయాలకు వెళ్లిపోతున్నాని చెప్పడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus