Pawan Kalyan: 17 ఏళ్ళ ‘బాలు’ గురించి దర్శకుడు కరుణాకరణ్ కామెంట్స్..!
January 6, 2022 / 07:32 PM IST
|Follow Us
1998 వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్- కరుణాకరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘తొలిప్రేమ’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్లాస్, మాస్, ఫ్యామిలీస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించిన ప్రేమకథా చిత్రమది.ఇప్పటికీ ‘తొలిప్రేమ’ బుల్లితెర పై ప్రసారమవుంటుంది అంటే చూస్తూ ఎంజాయ్ చేసే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు.ఎవర్ గ్రీన్ క్లాసిక్ అంటూ ఈ చిత్రాన్ని కొనియాడేవారి సంఖ్య కూడా పెద్దదే.
అయితే ఇదే కాంబినేషన్లో దాదాపు 7 ఏళ్ళ తర్వాత ‘బాలు’ అనే చిత్రం వస్తుంది అంటే ఎన్ని అంచనాలు నెలకొంటాయి. పవన్ కళ్యాణ్ సరసన శ్రీయ శరన్, నేహా ఒబెరాయ్ వంటి ఇద్దరు భామలు హీరోయిన్లు కాగా.. ‘వైజయంతి మూవీస్’ వంటి బడా సంస్థ పై అశ్వినీదత్ గారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండడంతో ఆ అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే ఆ అంచనాలను ‘బాలు’ అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కొంతగా రాణించినప్పటికీ తర్వాత చేతులెత్తేసింది.
ఈ చిత్రం అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవడానికి కారణమేంటి అని దర్శకుడు కరుణాకరణ్ ను ఓ సందర్భంలో ప్రశ్నిస్తే.. ” బాలు చాలా మంచి కథ. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి.కానీ ఆ టైములో అవి ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ‘తొలిప్రేమ’ కాంబినేషన్ కాబట్టి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టు నేను స్క్రీన్ ప్లే ప్లాన్ చేసుకోవాల్సింది.అది నా ఫాల్ట్. అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఎంతో నమ్మి.. చేసిన సినిమా అది.
ఫలితం అనుకున్న స్థాయిలో రాకపోయినా.. ఇప్పటికీ అన్నయ్య నాతో సినిమా చేయడానికి సిద్దంగానే ఉన్నట్టు చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన ఒక్కసారి ‘కరుణ్ సినిమా చేద్దాం’ అంటే.. వెంటనే మా కాంబినేషన్లో సినిమా మొదలైపోతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఈరోజుతో ‘బాలు’ సినిమా రిలీజ్ అయ్యి 17ఏళ్ళు పూర్తివస్తోంది.