Koratala Siva, Sukumar: కొరటాల శివ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

  • June 8, 2021 / 04:38 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న దర్శకుల జాబితాను పరిశీలిస్తే రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి ముందువరసలో ఉంటారు. ప్రస్తుతం కొరటాల శివ ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఈ దర్శకుడు ఒక విషయంలో బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ను ఫాలో కావడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా కొనసాగుతోంది. పుష్ప సినిమాకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్న సుకుమార్ మరోవైపు తన శిష్యులతో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

సుకుమార్ దర్శకునిగా సక్సెస్ సాధించడంతో పాటు తన శిష్యులకు కూడా ఇండస్ట్రీలో అవకాశాలు పెరిగేలా చేస్తున్నారు. శిష్యుల సినిమా కథలలో కీలక మార్పులు చేయడంతో పాటు సినిమా అవుట్ పుట్ పై దృష్టి పెట్టి నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యేలా సుకుమార్ సినీ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. దర్శకుడు కొరటాల శివ కూడా సుకుమార్ బాటలో తన శిష్యులతో, టాలెంట్ ఉన్న దర్శకులతో సినిమాలను నిర్మించాలని ప్లాన్ చేశారని సమాచారం.

ఇప్పటికే కొరటాల శివ అడ్వాన్స్ లు ఇచ్చి కొందరు దర్శకులను లాక్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సుకుమార్ లా కొరటాల శివ కూడా సక్సెస్ అయితే మరి కొందరు స్టార్ డైరెక్టర్లు ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యే అవకాశం ఉంది. మరి కొరటాల శివ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus