ఆ విషయంలో అస్సలు తగ్గేదే లేదు: దర్శకుడు కొరటాల శివ
August 29, 2020 / 02:34 PM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నాడు… ఆయన తరువాతి చిత్రం అయిన ‘ఆచార్య’ టీం సభ్యులు… ఆ చిత్రానికి సంబంధించి ఓ మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అయితే ‘ఆచార్య’ సినిమా కథ నాదే అంటూ రాజేష్ మండూరి అనే రైటర్… రచయితల సంఘానికి ఫిర్యాదు చేసాడు. ‘నేను రాసుకున్న కథని రెండేళ్ల క్రితమే ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మాతలకు వినిపించాను. బి.గోపాల్ గారి శిష్యుడను అయిన నేను ఈ కథని బాలయ్య బాబుతో చెయ్యాలి అనుకున్నాను.
కానీ ‘మైత్రి’ వారికి కొరటాల శివకి ఉన్న అనుబంధం వల్ల నా కథని కొరటాలకు ఇచ్చేసారు’ అంటూ ఆరోపణలు వ్యక్తం చేసాడు. అయితే… ‘కేవలం ఫస్ట్ లుక్ చూసి కథ నాదే అంటే ఎలా? ఆరోపణలు చేసిన ప్రతీ ఒక్కరికి నా కథని చెప్పుకుంటూ పోవాలా?నా పరువుకు భంగం కలిగించేలా కామెంట్స్ చెయ్యడం.. కథ విషయంలో నానా రచ్చ చేసి సినిమా రెప్యుటేషన్ తగ్గించాలని ట్రై చెయ్యడమే.!
నేను ఈ విషయం పై లీగల్ గానే ప్రొసీడ్ అవుతాను. కోర్టులోనే ఈ విషయాన్ని తేల్చుకోవాలనుకుంటున్నాను.ముందు ముందు పబ్లిసిటీ కోసం ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేవారికి బుద్ది చెప్పాలి’ అంటూ కొరటాల శివ మండిపడ్డాడు.