Director Laxmi Sowjanya: కన్నీటి కష్టాలు చెప్పుకున్న డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య!
November 15, 2021 / 02:59 PM IST
|Follow Us
నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన వరుడు కావలెను సినిమా గత నెల 29వ తేదీన రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా పలు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదని తెలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ 11 సంవత్సరాలకే తాను పదో తరగతి పాస్ అయ్యానని నాన్న ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్ అని తెలిపారు. లెక్కలు అంటే తనకు చచ్చేంత భయం ఉండేదని లక్ష్మీ సౌజన్య చెప్పుకొచ్చారు.
అబ్బాయిలు వెకిలి వేషాలు వేస్తే తాను చుక్కలు చూపించేదానినని ఒక అబ్బాయి సైకిల్ లో గాలి తీస్తే లెఫ్ట్ అండ్ రైట్ పీకానని ఆమె అన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ కావడంతో ఇంటికి వెళ్లి గేదెలు మేపుకోవాలని అందరూ గేలి చేశారని ఆమె వెల్లడించారు. డిగ్రీ కరెస్పాండెన్స్ లో చదివిన తర్వాత సినిమాలు తన దారిని మార్చాయని లక్ష్మీ సౌజన్య చెప్పుకొచ్చారు. లోకల్ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా కెరీర్ ను ప్రారంభించానని లక్ష్మీ సౌజన్య అన్నారు.
ధైర్యం, గోదావరి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని లక్ష్మీ సౌజన్య చెప్పుకొచ్చారు. సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో నాన్నకు పాంక్రియాస్ క్యాన్సర్ అని తెలిసిందని లక్ష్మీ సౌజన్య అన్నారు. నాన్న చనిపోయిన తర్వాత ఏడవకూడదని తనకు చెప్పారని నాన్నకు ఇచ్చిన మాట ప్రకారం ఏడవలేదని లక్ష్మీ సౌజన్య వెల్లడించారు. ఒక కామెడీ హీరో ఆడవాళ్ల డైరెక్షన్ లో చేయనని తనను రిజెక్ట్ చేశాడని శర్వానంద్ హీరోగా తెరకెక్కాల్సిన మూవీ ఆగిపోయిందని ఆమె అన్నారు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు సహాయంతో నిర్మాత చినబాబుకు వరుడు కావలెను కథ చెప్పానని నాన్న నా సక్సెస్ ను చూడలేకపోయారనే బాధ మనస్సులో ఉందని లక్ష్మీ సౌజన్య పేర్కొన్నారు.