తమిళ స్టార్ డైరెక్టర్ లింగు స్వామి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ‘రన్, పందెంకోడి, ఆవారా’ చిత్రాలతో బ్లాక్ బస్టర్లు కొట్టిన దర్శకుడు ఇతను. ఆ సినిమాలు తెలుగులో కూడా బాగా ఆడాయి. కానీ గతేడాది మొదటిసారిగా ఇతను స్ట్రైట్ తెలుగు మూవీ చేశాడు.రామ్ హీరోగా తెలుగు, తమిళ్ భాషల్లో బైలింగ్యువల్ మూవీగా రూపొందిన ‘వారియర్’ మూవీ అది. ఈ మూవీ పెద్ద ప్లాప్ అయ్యింది. ఇదిలా ఉండగా.. చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు లింగుస్వామికి 6 నెలలు జైలు శిక్ష పడినట్టు ప్రచారం జరుగుతుండడం హాట్ టాపిక్ అయ్యింది.
పీవీపీ సంస్థ.. గతేడాది లింగుసామి, అతని సోదరుడు సుభాష్ చంద్రబోస్ పై రూ. 1.03 కోట్ల చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. ‘తిరుపతి బ్రదర్స్’ పేరిట ప్రొడక్షన్ హౌస్ నిర్వహిస్తున్న లింగుస్వామి, సుభాష్ లు 2014లో పీవీపీ క్యాపిటల్ లిమిటెడ్ నుండి రూ.1.03 కోట్లు అప్పుగా తీసుకున్నారు. కానీ వారు ఇచ్చిన చెక్.. బౌన్స్ అవ్వడంతో పీవీపీ వారిపై కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ క్రమంలో చెన్నై, సైదాపేటలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు… దర్శకుడు లింగుస్వామికి చెక్ ఫ్రాడ్ కేసులో 6 నెలల జైలు శిక్ష విధించడం జరిగింది. ‘వారియర్’ రిలీజ్ అయ్యాక అంటే 2022 ఆగస్టు 22న దీని నిమిత్తం ఉత్తర్వులు జారీ చేయగా.. లింగుసామి తన అప్పీల్‌ను దాఖలు చేశారు.
సైదాపేట కోర్టు విధించిన 6 నెలల జైలు శిక్షపై ఏప్రిల్ 12న విచారించిన మద్రాసు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు సమర్ధిస్తూ లింగుస్వామికి షాకిచ్చింది. దీంతో ఇప్పుడు లింగుసామి 6 నెలల జైలు శిక్ష ఏర్పడినట్టు తెలుస్తుంది. దీని పై లింగుస్వామి మళ్ళీ అప్పీల్ కు వెళ్తామని తెలిపినట్టు సమాచారం.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!